Nithiin: కొడుకు తొలి బర్త్‌డే.. హీరో నితిన్ ఎమోష‌న‌ల్ పోస్ట్‌

ABN , Publish Date - Sep 07 , 2025 | 06:52 PM

నితిన్ తన కొడుకు అవ్యుత్ తొలి పుట్టినరోజును పెద్దగా హడావుడి చేయకుండా, కుటుంబ సభ్యులు, దగ్గరి మిత్రుల న‌డుమ నిర్వహించారు

Nithiin

టాలీవుడ్‌లో మంచి పేరు సంపాదించిన హీరో నితిన్ (Nithiin) తన కొడుకు అవ్యుత్ (Avyukth) తొలి పుట్టినరోజును పెద్దగా హడావుడి చేయకుండా, కుటుంబ సభ్యులు, దగ్గరి మిత్రులతో క‌లిసి ఆనందత్సోవాల న‌డుమ నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారి అవ్యుత్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి, “హ్యాపీ ఫస్ట్ బర్త్‌డే మై లిటిల్ ప్రిన్స్” అంటూ శుభాకాంక్షలు తెలిపాడు. అంతేగాక నా జీవితంలో విలువ క‌ట్ట‌లేని అమూల్య‌మైన కానుక ఇచ్చావంటూ భార్య శాలిని (Shalini)కి సైతం కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు.

Nithiin

ఇదిలాఉంటే ఇటీవ‌ల వ‌రుస‌గా చిత్రాలు ప‌రాజ‌యం పాల‌వ‌డంతో నితిన్ కెరీర్ కాస్త గాడీ త‌ప్ప‌డంతో ఇప్పుడు త‌న రానున్న సినిమాల పైనే పూర్తి దృష్టి సారించాడు. త‌న‌కు గ‌తంలో ఇష్క్ సినిమాతో త‌న కెరీర్‌ను లైన్‌లో పెట్టిన మ‌నం ఫేమ్‌ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో గుర్రపు స్వారీ నేపథ్యంలో ‘స్వారీ’ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్‌గా పూజా హెగ్డే పేరు ఖరారైనట్లు సమాచారం.

Nithiin

Updated Date - Sep 07 , 2025 | 06:52 PM