సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

బాలయ్య బిడ్డ తేజస్విని డ్యాన్స్‌ల వెనుక మతలబు ఏంటి? హీరోయిన్‌గా ఏమైనా..

ABN, Publish Date - Jul 15 , 2026 | 07:53 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా హైలైట్ అవుతున్నారు. ముఖ్యంగా ఆమె చేస్తున్న డ్యాన్స్ వీడియోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Balakrishna Daughter Tejaswnini

నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) చిన్న కుమార్తె తేజస్విని (Tejaswini) ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా హైలైట్ అవుతున్నారు. ముఖ్యంగా ఆమె చేస్తున్న డ్యాన్స్ వీడియోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతూ నందమూరి అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి ఈ స్టేజ్‌లో ఆమె ప్రత్యేకంగా డ్యాన్స్ నేర్చుకుని, పర్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు. బాలయ్య కూతురిగా, అటు అత్తారింట్లోనూ ఎలాంటి లోటు లేని లైఫ్ ఆమెది. మరి అలాంటి తేజస్విని ఇప్పుడు ఓ ప్రొఫెషనల్ డ్యాన్సర్‌లా స్టెప్పులేస్తూ అందరినీ సర్‌ప్రైజ్ చేయడం వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా అనే అనుమానాలు ఇండస్ట్రీ వర్గాల్లో మొదలయ్యాయి.


మరోవైపు నందమూరి వారసుడు మోక్షజ్ఞ (Mokshagna) సినీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ప్రతీసారి ‘ఇదిగో అదిగో’ అనడమే తప్ప మోక్షు ఎంట్రీకి ఇంకా మోక్షం లభించలేదు. ఈ నిరాశలో ఉన్న అభిమానులకు తేజస్విని డ్యాన్స్ వీడియోలు కాస్త ఊరటనిస్తున్నాయి. అయితే, అసలు తేజస్విని ఎందుకు ఇంతలా కష్టపడుతోంది అనే విషయంపై టాలీవుడ్‌లో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఒకవేళ ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు గ్రౌండ్ వర్క్ ఏమైనా చేస్తోందా? చిన్నప్పటి నుంచి ఉన్న యాక్టింగ్ కలని నెరవేర్చుకోవడానికి ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తోందా? అనే కోణంలో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ డిస్కస్ చేసుకుంటున్నారు.


ప్రస్తుతానికైతే ఈ డ్యాన్స్ వీడియోల వెనుక ఉన్న అసలు మతలబు ఏంటనేది సస్పెన్సే. కానీ, సినిమా ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు కోసం లేదా ఏదైనా ప్రత్యేక ప్రాజెక్ట్ కోసమే ఆమె ఇంతలా ఇన్వాల్వ్ అయి ప్రాక్టీస్ చేస్తుందనేది మాత్రం స్పష్టమవుతోంది. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది త్వరలోనే నందమూరి కాంపౌండ్ నుంచి అధికారికంగా తెలిసే అవకాశం ఉంది. అప్పటివరకు ఎంతో ఈజ్‌తో ఆమె వేస్తున్న స్టెప్పులను చూసి మురిసిపోవడం అభిమానుల వంతు. అసలు ఇంతలా ఇన్వాల్వ్ అయి డ్యాన్స్ ఎలా చేయగలుగుతోంది అని కొందరు అంటుంటే.. నందమూరి బ్లడ్ అండ్ బ్రీడ్ కదా, ఆ మాత్రం గ్రేస్ ఉండడంలో వింతేముంది అని ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

KA13: కిరణ్ అబ్బవరం పుట్టినరోజు స్పెషల్‌గా క్రేజీ మేకింగ్ వీడియో

మరోసారి దిల్ రాజు వర్సెస్ మైత్రీ.. దేవుడిపై భారం వేసిన ఎస్కేఎన్

టాలీవుడ్ ఎంట్రీ.. అమ్మ, నాన్న ఏం చెప్పారంటే : రాషా తడానీ

Updated Date - Jul 15 , 2026 | 07:53 PM