టాలీవుడ్ ఎంట్రీ.. అమ్మ, నాన్న ఏం చెప్పారంటే : రాషా తడానీ
ABN , Publish Date - Jul 15 , 2026 | 04:20 PM
హీరోయిన్ రాషా తడాని.. తన టాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తన అమ్మనాన్నలు.. ఆమె ఎంట్రీపై ఎలా స్పందించారో.. రాషా తెలిపారు.
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి యంగ్ సెన్సేషన్ జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) హీరోగా పరిచయం కాబోతోన్న విషయం తెలిసిందే. అజయ్ భుపతి దర్శకత్వంలో జయకృష్ణ చేస్తోన్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ (Srinivasa Mangapuram). ఈ సినిమాతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ (Raveena Tandon) కుమార్తె రాషా తడాని (Rasha Thadani) టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమవుతోంది. నిర్మాత పి. కిరణ్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్విని దత్ సమర్పిస్తున్నారు. జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో వచ్చేందుకు ఈ సినిమా సిద్ధమవుతోంది. ప్రస్తుతం ప్రమోషన్స్‌ను యమా జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జరిగిన ఇంటర్వ్యూలో హీరోయిన్ రాషా తడాని.. తన టాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
‘‘నాకసలు తెలుగు తెలియదు. మొదట్లో డైలాగులు అర్థం చేసుకోవడానికే చాలా కష్టపడ్డాను. కానీ, దర్శకుడు అజయ్ భూపతి నాకు చాలా హెల్ప్ చేశారు. ఆయన తెలుగు, హిందీ కలిపి డైలాగులకు అర్థం చెప్పడంతో నా పని చాలా ఈజీ అయింది. పూర్తిగా ప్రిపేర్ అయిన తర్వాతే షూటింగ్ చేసేవాళ్లం. నాకు కావాల్సిన టైమ్ ఇచ్చేవారు. వైజయంతి మూవీస్ చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థ అని తెలుసు. ఆ సంస్థ నుంచి మహేష్ బాబుతో పాటు ఎంతో మంది స్టార్స్ పరిచయం అయ్యారు. నా జీవితంలో కలిసిన బెస్ట్ పర్సన్స్‌లో నిర్మాత అశ్విని దత్ ఒకరు. ఆయన నన్ను ఎప్పుడూ మనవరాలిలా చూసుకునేవారు. ఏది కావాలన్నా అడగమని చెప్పేవారు. ఆయనకు మా తాతగారితో కూడా మంచి పరిచయం ఉంది.
తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి కారణం.. నాకు తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. ‘బాహుబలి’ నాకు ఎంతో నచ్చిన సినిమా. తెలుగు సినిమా ప్రస్తుతం చాలా అడ్వాన్స్‌గా దూసుకెళుతోంది. ప్రతి సినిమా ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది. ఇలాంటి పరిశ్రమలో తప్పకుండా పని చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వెళతానని అమ్మకు చెప్పినప్పుడు.. చాలా ఆరోగ్యకరమైన, ఆనందకరమైన వాతావరణం అక్కడ ఉంటుందని అమ్మ చెప్పారు. షూటింగ్ ఎక్స్‌పీరియెన్స్ కూడా చాలా ఫన్‌గా ఉంటుందని అన్నారు. అలాగే తెలుగు భాష నేర్చుకోమని సలహా ఇచ్చారు. ఆమె చెప్పినట్టుగానే తెలుగు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇక నాన్న అయితే చాలా సంతోషించారు. ఆయనకు కూడా తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. కొన్ని సందర్భాల్లో హైదరాబాద్‌కి షిఫ్ట్ అవ్వాలని కూడా అనుకున్నారు. నేను తెలుగులో నటించడం ఆయనకు చాలా సంతోషంగా అనిపించింది. ‘శ్రీనివాస మంగాపురం’ వంటి ఒక మంచి సినిమాతో తెలుగులో పరిచయం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను..’’ అని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
నిన్న తండ్రితో... రేపు కొడుకుతో... నయన్ నట విన్యాసం!
పోసాని భార్యను బ్రతిమిలాడిన త్రివిక్రమ్.. ఎందుకో తెలుసా
రాష్ట్రాన్ని లీడ్ చేసే అవకాశం వస్తే.. సినీ ఇండస్ట్రీలో అలా చేస్తా: కవిత కల్వకుంట్ల