KA13: కిరణ్ అబ్బవరం పుట్టినరోజు స్పెషల్‌గా క్రేజీ మేకింగ్ వీడియో
ABN , Publish Date - Jul 15 , 2026 | 05:56 PM
‘క’, ‘కె-ర్యాంప్’ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకొని ఫుల్ జోష్‌లో ఉన్న హీరో కిరణ్ అబ్బవరం పుట్టినరోజు నేడు (జూలై 15). ఈ సందర్భంగా ఆయన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న ప్రాజెక్ట్ ‘KA13’ నుంచి మేకర్స్ ఒక క్రేజీ అప్‌డేట్‌ను వదిలారు.
‘క’, ‘కె-ర్యాంప్’ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకొని ఫుల్ జోష్‌లో ఉన్న హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) పుట్టినరోజు నేడు (జూలై 15). ఈ సందర్భంగా ఆయన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న ప్రాజెక్ట్ ‘KA13’ నుంచి మేకర్స్ ఒక క్రేజీ అప్‌డేట్‌ను వదిలారు. జాయ్ ఫిలిమ్స్ పతాకంపై ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ చాగంటి (Sudhakar Chaganti) నిర్మాతగా పరిచయమవుతూ నిర్మిస్తోన్న ఈ భారీ చిత్రానికి సురేష్ ఎర్ర కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా.. డైరెక్షన్ కూడా కిరణ్ అబ్బవరమే చేస్తున్నారు. కిరణ్ అబ్బవరం బర్త్‌డే స్పెషల్‌గా సినిమా మొదటి షెడ్యూల్‌కు సంబంధించిన బిహైండ్ ది సీన్స్ (BTS) మేకింగ్ వీడియోను టీమ్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారుతూ సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తోంది. (HBD Kiran Abbavaram)
ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం కేవలం హీరోగా మాత్రమే కాకుండా వినూత్న బాధ్యతలను భుజాన వేసుకున్నారు. గతంలో ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ సినిమాతో తనలోని రైటింగ్ టాలెంట్‌ను నిరూపించుకున్న ఆయన, ఈ సారి ఏకంగా కథ, స్క్రీన్‌ప్లే రాయడంతో పాటు స్వయంగా మెగాఫోన్ పట్టి దర్శకత్వం కూడా వహిస్తున్నారు. తాజాగా విడుదలైన మేకింగ్ వీడియోలో కిరణ్ అబ్బవరం వన్-మెన్ షో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు నటుడిగా కెమెరా ముందుకు వస్తూనే, మరోవైపు మానిటర్ దగ్గర కూర్చొని సీన్లను పర్యవేక్షించడం, తోటి నటీనటులకు హావభావాలను వివరించడం, సాంకేతిక బృందంతో షాట్స్ గురించి చర్చించడం వంటి విజువల్స్ ఆయనలోని మల్టీ-టాలెంట్‌ను చాటిచెబుతున్నాయి. సెట్స్‌లో యూనిట్ అంతా నవ్వులు, ఎమోషన్స్, ఫుల్-ఆన్ ఫన్‌తో ఎంతో ఉత్సాహంగా జరుపుకున్న వేడుకలు, చిత్ర బృందం మధ్య ఉన్న బలమైన బాండింగ్‌ను ఈ బిహైండ్ ది సీన్స్ వీడియో కళ్లకు కట్టింది. కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో, అత్యంత భారీ కాన్వాస్‌పై ఈ సినిమాను విజువల్ వండర్‌గా నిర్మిస్తున్నారు.
కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు మనసుకు హత్తుకునే ఎమోషన్స్, సరికొత్త వినోదభరితమైన కథాంశంతో వస్తున్న ఈ చిత్రంలో దేవికా భట్ (Devika Bhat) హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమవుతోంది. అలాగే సీనియర్ నటులు శరత్ కుమార్, సాయి కుమార్ ఈ సినిమాలో అత్యంత కీలకమైన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి టెక్నికల్ పరంగా కూడా టాప్ క్లాస్ బృందం పనిచేస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతోన్న కిరణ్ అబ్బవరం, ఈ సినిమా ద్వారా మొదటిసారిగా దర్శకత్వ బాధ్యతలను కూడా స్వీకరించడంతో.. ఈ వినోదాత్మక ప్రాజెక్ట్‌పై ట్రేడ్ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ క్యూరియాసిటీ నెలకొంది.
ఇవి కూడా చదవండి:
మరోసారి దిల్ రాజు వర్సెస్ మైత్రీ.. దేవుడిపై భారం వేసిన ఎస్కేఎన్
టాలీవుడ్ ఎంట్రీ.. అమ్మ, నాన్న ఏం చెప్పారంటే : రాషా తడానీ
నిన్న తండ్రితో... రేపు కొడుకుతో... నయన్ నట విన్యాసం!