Nayanthara: నయనతార ‘మూకుత్తి అమ్మన్ 2’కు బ్రేక్? విడుదలపై కొత్త ట్విస్ట్!
ABN, Publish Date - Sep 21 , 2026 | 11:18 AM
నయనతార(Nayanathara) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘మూకుత్తి అమ్మన్ 2’ విడుదలపై ప్రస్తుతం కోలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగు
నయనతార(Nayanathara) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘మూకుత్తి అమ్మన్ 2’ విడుదలపై ప్రస్తుతం కోలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సుందర్ సి (sunder C) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. గతంలో తమిళంతోపాటు తెలుగులోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘మూకుత్తి అమ్మన్’కు సీక్వెల్‌గా రూపొందుతోంది. తెలుగులో ఈ చిత్రం ‘అమ్మోరు తల్లి’ పేరుతో విడుదలై మంచి స్పందనను సొంతం చేసుకుంది.
మొదటి భాగంలో భక్తి, వినోదం, సామాజిక అంశాలను మేళవించి కథను తెరకెక్కించగా.. సీక్వెల్‌లోనూ అదే తరహాలో కొత్త కథాంశాన్ని చూపించనున్నట్లు సమాచారం. అయితే ఈసారి కథా పరిధిని మరింత విస్తరించడంతోపాటు భారీ విజువల్స్, గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. నయనతార మరోసారి అమ్మవారి పాత్రలో కనిపించనుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ‘మూకుత్తి అమ్మన్ 2’ను దీపావళి కానుకగా నవంబరు 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం గతంలో భావించింది. అయితే తాజాగా ఈ విడుదల తేదీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నవంబరు 6న సినిమా విడుదల కావడం కష్టమేనని కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ప్రధానంగా సినిమాలోని వీఎఫ్‌ఎక్స్ పనులే ఇందుకు కారణమని సమాచారం. కథలో కీలకంగా ఉండే కొన్ని సన్నివేశాలకు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఇంకా పూర్తికావాల్సి ఉందని, వాటిని హడావుడిగా పూర్తి చేయడం కంటే నాణ్యత విషయంలో రాజీ పడకుండా మరికొంత సమయం తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అనుకున్న తేదీకి విడుదల చేయడం కంటే సినిమాను వాయిదా వేసే దిశగా చిత్రబృందం ఆలోచిస్తున్నట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. అయితే విడుదల వాయిదాపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. దీంతో నవంబరు 6న సినిమా వస్తుందా? లేక కొత్త విడుదల తేదీని ప్రకటిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. వీఎఫ్‌ఎక్స్ పనులు పూర్తయిన తర్వాతే కొత్త విడుదల తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ALSO READ:
విజయ్ రాఘవేంద్ర ‘ఆన్ డ్యూటీ’.. క్రైమ్ యాక్షన్‌లో నెవర్ బిఫోర్ స్క్రీన్‌ప్లే!
రూ.కోటి కూడా రాలేదట! మమ్ముట్టి గెస్ట్ రోల్ చేసినా.. ప్రయోజనం లేకుండా పోయిందే!
Tuesday Tv Movies: సెప్టెంబర్ 22, మంగళవారం.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు
పాపం 'స్వీటీ' ఏ స్థాయిలో ఉండే.. ఇప్పుడేమైపోయింది
Spirit: ప్రభాస్ ఊరమాస్ ట్రీట్.. థియేటర్లు ఇక ఊగి పోవాల్సిందే!