రూ.కోటి కూడా రాలేదట! మమ్ముట్టి గెస్ట్‌ రోల్‌ చేసినా.. ప్రయోజనం లేకుండా పోయిందే!

ABN , Publish Date - Sep 21 , 2026 | 10:10 AM

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి క్రేజ్‌కు కేరళలో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Mammootty

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) క్రేజ్‌కు కేరళలో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కనిపిస్తే చాలు సినిమా మీద ఒక్కసారిగా ఆసక్తి పెరగడం సహజం. ముఖ్యంగా ఆయనకు సంబంధించిన ఐకానిక్ పాత్రలను మరోసారి తెరపై చూపిస్తే అభిమానుల్లో అంచనాలు మరింత పెరుగుతాయి. అయితే తాజాగా మమ్ముట్టి అతిథి పాత్రలో కనిపించిన ఓ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ప్రభావం చూపలేక కుప్పకూలి పోయింది. ప్రకాష్ వర్మ (Prakash Varma) దర్శకత్వంలో భారీ అంచనాలతో తెరకెక్కిన ‘లా అండ్ ఆర్డర్’ (L&O Law and Order) సినిమా తొలి రోజే నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. థియేటర్లలో ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన రాకపోవడంతో వసూళ్లు కూడా దారుణంగా పడిపోయాయి. సినిమాలో మమ్ముట్టి ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించడం కూడా ఈ మూవీకి కలిసిరాలేదు.

రెండు రోజుల్లోనూ అదే పరిస్థితి

‘లా అండ్ ఆర్డర్’ సినిమాకు కేరళంలో తొలి రోజు దాదాపు రూ.35 లక్షల గ్రాస్‌తో సరిపెట్టుకున్న‌ట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో కలిపి కూడా రూ.55 లక్షల మార్కును దాటలేకపోయింది. భారీ అంచనాలతో విడుదలైన సినిమాకు ఈ స్థాయి వసూళ్లు రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. సినిమా విడుదలకు ముందు మమ్ముట్టి గెస్ట్‌ అప్పియరెన్స్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఆయన తన పాపులర్ ఐకానిక్ ‘కరిక్కమూరి’ (Karikkamuri Shanmughan) పాత్రలో కనిపించడంతో అభిమానులు థియేటర్లలో ఆ సన్నివేశం కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే మమ్ముట్టి ఎంట్రీకి భారీ హైప్ ఇచ్చిన‌ప్ప‌టికీ సినిమాలో కంటెంట్ వీక్ కావడంతో ఆడియెన్స్ ఏమాత్రం కనికరం చూపలేదు.

సాధారణంగా స్టార్ హీరోల అతిథి పాత్రలు సినిమాకు అదనపు బజ్ తీసుకొస్తాయి. సోషల్ మీడియాలో చర్చ పెరగడం, ఫ్యాన్స్ థియేటర్లకు రావడం వంటి అంశాలు ఓపెనింగ్స్‌కు కొంతవరకు ఉపయోగపడతాయి. కానీ ‘లా అండ్ ఆర్డర్’ విషయంలో మాత్రం మమ్ముట్టి గెస్ట్‌ రోల్‌ కూడా సినిమాకు పెద్దగా ఉపయోగపడలేదని వసూళ్లను బట్టి తెలుస్తోంది. సినిమా కంటెంట్‌పై వచ్చిన నెగెటివ్ టాక్ ప్రభావం మొదటి రోజు నుంచే కనిపించింది. ముఖ్యంగా రెస్టాఫ్ ఇండియాలో ఈ సినిమా పరిస్థితి మరింత దారుణంగా ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ తొలి రోజే సినిమా దాదాపు వాష్‌అవుట్‌ అయినట్లు సమాచారం.

రూ.1 కోటి గ్రాస్ కూడా కష్టమేనా?

ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ను పరిశీలిస్తే ‘లా అండ్ ఆర్డర్’ ఫైనల్ రన్‌లో కూడా పెద్దగా వసూళ్లు సాధించే అవకాశం కనిపించడం లేదని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమా మొత్తంగా కనీసం రూ.1 కోటి గ్రాస్ మార్కును కూడా అందుకోలేదని ట్రేడ్ వర్గాలు తేల్చేశాయి. మమ్ముట్టి వంటి స్టార్ అతిథి పాత్రలో కనిపించినప్పటికీ సినిమాకు సరైన కంటెంట్ లేకపోతే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఎంత కష్టమో ‘లా అండ్ ఆర్డర్’ వసూళ్లు మరోసారి చూపించాయని చెప్పొచ్చు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఇలా స్వల్ప వసూళ్లకే పరిమితం కావడం మలయాళ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Sep 21 , 2026 | 10:10 AM