సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రాజీనామా.. నట్టి కుమార్ సంచలన నిర్ణయం

ABN, Publish Date - May 13 , 2026 | 04:00 PM

ప్రస్తుతం టాలీవుడ్‌లో పర్సంటేజీ విధానం విషయంలో తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ పనితీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. నిర్మాత నట్టి కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఆయన అనేక ఆరోపణలు చేశారు.

Natti Kumar

ప్రస్తుతం టాలీవుడ్‌లో పర్సంటేజీ విధానంపై ఎలాంటి చర్చలు నడుస్తున్నాయో తెలియంది కాదు. ఈ క్రమంలో తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ పనితీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. నిర్మాత నట్టి కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా ఉన్న ఆయన, తన పదవికి రాజీనామా (Natti Kumar Resignation) చేస్తున్నట్లుగా ప్రకటించి, అందుకు కారణం ఏమిటో తెలిపారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన రాజీనామా లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లేఖలో..

‘‘తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న నట్టి కుమార్ (Natti Kumar) అనే నేను, నా పదవికి తక్షణమే రాజీనామా సమర్పిస్తున్నాను. కౌన్సిల్ ప్రస్తుత పనితీరుపై తీవ్ర అసంతృప్తి, ఆందోళనతో నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. నిర్మాతలు, ఎగ్జిబిటర్లుగా మనం పర్సంటేజీ విధానాన్ని సరిగ్గా నిర్వహించడంలో విఫలమయ్యాము. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో, గిల్డ్ కార్యకలాపాలను నిర్వహించడంలో కార్యవర్గ సభ్యులకు సరైన సమాచారం అందించడం లేదు. ఈ విధానం వల్ల చిన్న నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు, అదే సమయంలో ఎగ్జిబిటర్లది పైచేయి అవుతోంది. ఈ అసమానతల కారణంగా చాలా మంది నిర్మాతలు, ముఖ్యంగా చిన్న, మధ్యతరగతి నిర్మాతలు పతనం అవ్వడమే కాకుండా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.


అంతేకాకుండా, కార్యవర్గ సభ్యులకు సరైన సమాచారం ఇవ్వకుండా, వారి ప్రమేయం లేకుండా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సరైన ఎన్నికలు లేదా ప్రజాస్వామ్య పద్ధతులు లేకుండానే సంస్థ కొనసాగుతోంది. పరిపాలన, ఖాతాలు, ఆడిటింగ్, ఆర్థిక నిర్వహణలో పారదర్శకత లోపించింది. బాధ్యతాయుతమైన వ్యవస్థగా సరైన పనితీరు ఏమాత్రం కనిపించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో, నేను ఉండి కూడా ఏమీ చేయలేనప్పుడు.. నా విధులను పారదర్శకంగా నిర్వహించలేనప్పుడు, ఈ బాధ్యతాయుతమైన పదవిలో కొనసాగడం అర్థరహితమని భావిస్తున్నాను.


ఒక సంస్థ అనేది పారదర్శకత, జవాబుదారీతనం, రెగ్యులర్ సమావేశాలు, నిష్పక్షపాత ఎన్నికలు, అందరి సమక్షంలో చర్చలు నడవాలని నేను బలంగా నమ్ముతాను. కనీసం నా రాజీనామా తర్వాతనైనా, కార్యవర్గ సభ్యులందరూ క్రియాశీలకంగా మారి, బాధ్యతాయుతంగా పాల్గొని, నిర్మాతలందరి సంక్షేమం కోసం సరైన నిర్ణయాలు తీసుకుంటూ సంస్థను గౌరవంగా నడిపిస్తారని కోరుకుంటున్నాను. సంస్థను బలోపేతం చేయడానికి సరైన నిర్ణయాలు తీసుకోవాలని అందరినీ అభ్యర్థిస్తున్నాను. కౌన్సిల్ దయచేసి నా రాజీనామాను ఆమోదించాలని, సంస్థ యొక్క మెరుగైన భవిష్యత్తు కోసం నా సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాను’’ అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

పవన్ కళ్యాణ్, విజయ్‌ల విజయ రహస్యం అదే: ఆర్జే బాలాజీ

అందుకే తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్ చేయడం లేదు- బోయపాటి శ్రీను

Peddi Movie: ‘పెద్ది’ ట్రైలర్‌కు డేట్ ఫిక్సయింది.. బుచ్చిబాబు ప్లాన్ ఇదే!

తన తొలి సినిమా హీరో విజయ్‌ పై ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్!

Updated Date - May 13 , 2026 | 05:37 PM