Nenu Ready: టాలీవుడ్‌లో అందాల జాతరకు నర్గీస్ ఫక్రి ‘రెడీ’!

ABN , Publish Date - May 16 , 2026 | 11:24 AM

ఈ మధ్య బాలీవుడ్ అందాల భామ నర్గీస్ ఫక్రి గురించి టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ భామ టాలీవుడ్ ఎంట్రీకి సంబంధించి వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చేసింది.

Nargis Fakhri Tollywood Entry Update

ఈ మధ్య బాలీవుడ్ అందాల భామ నర్గీస్ ఫక్రి గురించి టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తన అందాలతో బాలీవుడ్‌లో సంచలన విజయాలను అందుకున్న నర్గీస్ ఫక్రి.. నటసింహం నందమూరి బాలయ్య (Nandamuri Balakrishna) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందనేలా ఈ మధ్య టాక్ నడిచింది. ఆ టాక్‌లో నిజం ఎంతనేది ఇంకా తెలియదు కానీ, అంతకంటే ముందే ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఫిక్సయింది. నర్గీస్ ఫక్రి (Nargis Fakhri) ‘నేను రెడీ’ (Nenu Ready) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. ఈ మేరకు మేకర్స్ అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు.


యువ హీరో హవీష్ (Havish), అందాల భామ కావ్య థాపర్ (Kavya Thapar) జంటగా.. సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు నక్కిన త్రినాధరావు రూపొందిస్తోన్న చిత్రం ‘నేను రెడీ’. ఈ సినిమాతోనే నర్గీస్ ఫక్రి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. సినిమాలోని ప్రత్యేకమైన పాటలో తన అందచందాలతో యువతను మైమరపించునుందని తెలుపుతూ మేకర్స్ ఓ పోస్టర్ కూడా వదిలారు. ఈ పోస్టర్‌లో నర్గీస్ ఫక్రి‌ని చూస్తుంటే.. అందాల విందు మాములుగా ఉండదని అనిపిస్తోంది. త్వరలోనే ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేయనున్నారని తెలుస్తోంది.


ఆర్ఆర్‌తో సహా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జూన్ రెండవ వారంలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అన్ని హంగులతో, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ సినిమా ఉంటుందని.. హవీష్‌కు క్లీన్ కమర్షియల్ హిట్‌గా నిలుస్తుందని.. యూనిట్ చెబుతోంది. వచ్చే వారంలో ఆడియో రిలీజ్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ వెంటనే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తామని నిర్మాతలు చెబుతున్నారు. హార్నిక్స్ ఇండియా LLP బ్యానర్ పై కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Keneeshaa: 4 నెలల బిడ్డను కోల్పోయిన నేను.. జయం రవి జీవితం నాశనం చేస్తానా?

లవ్‌ - రిలేషన్‌‌పై మిల్కీ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు

Peddi Movie: రామ్ బుజ్జిగా దివ్యేందు శర్మ.. వీడియో వైరల్!

మోదీ ‘పొదుపు మంత్రం’.. కమల్ హాసన్ సంచలన ప్రకటన!

Updated Date - May 16 , 2026 | 11:24 AM

Nenu Ready Telugu Movie: కావాల్సినంత వినోదం

Nenu Ready: క్లైమాక్స్ లో.. హవిష్ 'నేను రెడీ'

Nenu Ready: ఫ్యామిలీ బొనాంజగా హవీష్ మూవీ

Nenu Ready: మ‌రోసారి.. ఫ్యామిలీ కామెడీ డ్రామాతో దిగుతున్న త్రినాథరావు

Nenu Ready: వినోదాత్మక చిత్రం