Nenu Ready: మ‌రోసారి.. ఫ్యామిలీ కామెడీ డ్రామాతో దిగుతున్న త్రినాథరావు

ABN , Publish Date - Jan 12 , 2026 | 06:02 PM

యంగ్ హీరో హవిష్ క‌థానాయ‌కుడిగా త్రినాథరావు నక్కిన డైరెక్ష‌న్‌లో రూపొందిన‌ చిత్రం నేను రెడీ.

Nenu Ready

యంగ్ హీరో హవిష్ క‌థానాయ‌కుడిగా త్రినాథరావు నక్కిన (Trinadha Rao Nakkina) డైరెక్ష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం నేను రెడీ (Nenu Ready). కావ్యా థాప‌ర్ (Kavya Thapar) క‌థానాయిక‌గా న‌టిస్తోండ‌గా ముర‌ళీ శ‌ర్మ‌, రోహిణి, అజ‌య్ హ‌రితేజ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు ముస్తాబ‌డుతోంది. ఈనేప‌థ్యంలో తాజాగా సోమ‌వారం ఈ మూవీ టీజ‌ర్ విడుద‌ల చేశారు.

టీజ‌ర్ చూస్తే.. త్రినాధ రావు మ‌రోసారి త‌నకు వ‌చ్చిన ఫ్యామిలీ డ్రామా క‌థ‌తోవినోదం పండించ‌నున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. కొత్త‌గా పెళ్లి చేసుకున్న జంట‌, చాలీ చాల‌నీ జీతం, నాన్‌వెజ్ తినే తెలంగాణ అమ్మాయి వెజ్‌టేరియ‌న్ అయిన అబ్బాయి, డ‌జ‌న్ మంది కుటుంబ స‌భ్యులు ఆత‌నిపైనే ఆధార ప‌డ‌డం వంటి పాయింట్ల‌ను ట‌చ్ చేసి ఆద్యంతం న‌వ్వులు పంచేలా సినిమాను తెర‌కెక్కించారు. మీరూ టీజ‌ర్‌పై ఓ లుక్కేయండి.

Updated Date - Jan 12 , 2026 | 06:02 PM