Nenu Ready: ఫ్యామిలీ బొనాంజగా హవీష్ మూవీ

ABN , Publish Date - Jun 26 , 2025 | 10:43 AM

హవీష్ నటిస్తున్న కొత్త సినిమా 'నేను రెడీ'. జూన్ 25న హవీష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ టైటిల్ ను ప్రకటించి, గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

'నువ్విలా, జీనియస్, రామ్ లీలా, సెవెన్' వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో హవీష్‌ (Havish). జూన్ 25 అతని పుట్టిన రోజు. ఆ సందర్భంగా ప్రస్తుతం సెట్స్ పై ఉన్న హవీష్‌ మూవీ టైటిల్ ను మేకర్స్ ప్రకటించారు. అలానే టైటిల్ గ్లింప్స్ ను విడుదల చేశారు. 'నేను రెడీ' (Nenu Ready) అనే పేరు పెట్టిన ఈ సినిమాను నక్కిన త్రినాథ రావు (Nakkina Trinadha Rao) దర్శకత్వంలో నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ (Mickey J Meyer) సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది.


GANI2811.jpgబుధవారం సాయంత్రం జరిగిన టైటిల్ గ్లింప్స్ విడుదల కార్యక్రమంలో హవీష్‌ మాట్లాడుతూ, 'ఈ బర్త్ డే నాకు ఎంతో స్పెషల్. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. గ్యాప్ తీసుకోకుండా మూవీస్ చేయమని నా వెల్ విషర్స్ చెబుతుంటారు. నాకు ప్రతి రోజూ ఓ సినిమా రిలీజ్ చేయాలని ఉంటుంది. కానీ లో-క్వాలిటీ మూవీస్ చేయకూడదు. మంచి స్టాండర్డ్స్ లో చేయాలనుకుంటాను. మంచి అవకాశాలు రావాలని రోజూ కోరుకుంటాను. త్రినాథరావు గారితో ఎప్పుడో మూవీ చేయాల్సింది. కానీ ఆయన బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. 'నేను రెడీ' మూవీతో ఆ అవకాశం రావడం సంతోషంగా ఉంది. 'నేను రెడీ' బ్రిలియంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. త్రినాథరావు గారి అన్ని మూవీస్ లో కల్లా ఈ సినిమాకే బెస్ట్ స్క్రిప్ట్ కుదిరిందని చెప్పగలను. ఈ చిత్రంలో ప్రతి యాక్టర్ బాగా పర్ ఫార్మ్ చేశారు. మిక్కీ గారి మ్యూజిక్, నిజార్ గారి విజువల్స్ బ్యూటిఫుల్ గా ఉంటాయి. ప్రవీణ్ పూడి గారు కూడా నేను అడగగానే వచ్చి వర్క్ చేశారు. మీ అందరినీ థియేటర్స్ లో కలిసేందుకు వెయిట్ చేస్తున్నాను' అని అన్నారు. ఈ సినిమాతో నిర్మాతగా చిత్రసీమలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉందని కోనేరు నిఖిల తెలిపారు. తన తండ్రి సత్యనారాయణ 'జీనియస్, రాక్షసుడు' వంటి హిట్ చిత్రాలను నిర్మించారని, విద్యారంగానికి ఎంతో సేవ చేస్తున్నారని, ఆయన లెగసీని ముందుకు తీసుకెళ్ళాలనే కల ఈ సినిమాతో తీరుతోందని నిఖిల తెలిపారు.


దర్శకుడు త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ, 'కుబేర చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అలానే శుక్రవారం వస్తున్న 'కన్నప్ప' కూడా చక్కని విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను. సినిమాలు వరుసగా విజయం సాధించి, థియేటర్లు కళకళలాడాలి. ఈ సినిమా విషయానికి వస్తే... 'మజాకా' సినిమా షూటింగ్ కంప్లీట్ కాగానే రచయిత విక్రాంత్ శ్రీనివాస్ ఈ కథను చెప్పారు. హవీష్‌ కు ఇది బాగుంటుందనిపించింది. ఆయన వినిపిస్తే ఓకే చెప్పారు. చక్కని ఫ్యామిలీ వాల్యూస్ తో చిన్నపాటి సెంటిమెంట్ తో ఉండే ఫ్యామిలీ బొనాంజా మూవీ ఇది. ఇప్పటికే యాభై శాతం షూటింగ్ పూర్తయ్యింది' అని అన్నారు.

WhatsApp Image 2025-06-26 at 11.57.55 AM.jpegఈ కార్యక్రమంలో హీరోయిన్ కావ్య థాపర్, నటీనటులు 'బలగం' సత్యనారాయణ, జయవాణి, మాణిక్ రెడ్డి, రూపలక్ష్మీ, మహతి, హరితేజ, గోపరాజు రమణ, రోహన్ రాయ్, ఎడిటర్ ప్రవీణ్‌ పూడి, కథ, మాటల రచయిత విక్రాంత్ శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు.

Also Read: Manchu Vishnu: కన్నప్ప కు కోపం తెప్పించకండి...

Also Read: Tv Movies: గురువారం.. తెలుగు టీవీ సినిమాలివే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Jun 26 , 2025 | 01:01 PM