సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

The Paradise: నానికి క్రేజ్‌ మామూలుగా లేదుగా...

ABN, Publish Date - Aug 29 , 2026 | 10:49 AM

డల్లాస్‌లో జరిగిన అనిరుధ్‌ కన్సర్ట్ లో నాని 'ది ప్యారడైజ్‌'లోని సెకండ్ సింగిల్‌ 'యేష నాగుల'ను విడుదల చేశారు. ఈ పాటను స్వయంగా అనిరుధ్‌ పాడగా, అతనితో కలిసి నాని వేదికపై డాన్స్ చేశారు.

The Paradise Movie

నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ 'ది పారడైజ్' సెకండ్ సింగిల్‌ అమెరికాలో అనిరుథ్‌ లైవ్‌ కన్సర్ట్ లో విడుదల అయ్యింది. మ్యూజిక్‌ సెన్సేషన్ అనిరుథ్‌ స్వయంగా ఈ పాటను ఆలపించగా, అతనితో కలిసి హీరో నాని సైతం స్టెప్పులేసి కన్సర్ట్ లో పాల్గొన్న కుర్రకారులో సరికొత్త జోష్ నింపాడు. డల్లాస్‌ లోని కర్టిస్‌ కల్ వెల్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకకు హాజరైన వారంత విజిల్స్, క్లాప్స్ తో హోరెత్తించేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్‌ 'ఆయా షేర్' చార్ట్ బస్టర్ గా నిలవగా, ఇప్పుడు దానికి ఈ సెకండ్‌ సింగిల్‌ 'యేష నాగుల' జత అయ్యింది. తెలంగాణ ఫోక్ మాస్ ఆంథమ్ గా దీనిని కాసర్ల శ్యామ్ రాయగా, సినిమాలో పాటను జంగిరెడ్డి, సందీప్ కుమార్ పాడారు. సందీప్‌ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ స్పెషల్ సాంగ్‌ను మూవీలో నాని, కీర్తి సురేశ్‌పై చిత్రీకరించారు.


సుధాకర్ చెరుకూరి నిర్మించిన 'ది ప్యారడైజ్' సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్ కాగా మోహన్ బాబు ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 24న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఇప్పుడు అనిరుథ్‌తో కలిసి అతని అమెరికా కన్సర్ట్ లో నాని పాల్గొనడంతో 'ది ప్యారడైజ్'కు వరల్డ్ వైడ్ గ్రేట్ రికగ్నైజేషన్ వచ్చింది. సహజంగానే నాని సినిమాలు యుఎస్ఎలో మంచి కలెక్షన్స్ ను రాబడుతుంటాయి. ఇప్పుడు ఈ 'ది ప్యారడైజ్'తో ఆ పాత రికార్డులన్నీ చెల్లా చెదురైపోతాయని నాని అభిమానులు నమ్ముతున్నారు. దానికి అనిరుధ్‌ కన్సెర్ట్ లో సెకండ్ సింగిల్ రిలీజ్‌ చేయడం మరింత ఉపయోగపడబోతోంది.

ఇవి కూడా చదవండి:

హీరోయిన్లు కాదు.. విలన్లు! నెగెటివ్‌ పాత్రలతో మెప్పిస్తున్న భామలు

Raviteja: ‘ఇరుముడి’ తర్వాత రవితేజ స్పీడ్‌.. ఐశ్వర్య రాజేశ్‌తో కొత్త ప్రయోగం!

కృతి సనన్‌ రాఖీ యాడ్‌ వివాదం.. మధు చోప్రా హాట్‌ కామెంట్స్‌!

Updated Date - Aug 29 , 2026 | 10:49 AM