King Nagarjuna: నిజంగా భయపడ్డాను.. అందుకే నవ్వాను

ABN , First Publish Date - 2023-06-15T21:45:18+05:30 IST

రేపు (జూన్ 16) ఒక పెద్ద సినిమా ప్రభాస్ ఆదిపురుష్ వస్తుంది. ప్రభాస్ అండ్ టీమ్‌కి ఆల్ ది బెస్ట్. ఈ సినిమా అందరినీ మళ్ళీ థియేటర్లలోకి తీసుకువస్తుందని ఆశిస్తున్నానని అన్నారు కింగ్ నాగార్జున. తాజాగా ఆయన అవికా గోర్ ప్రధాన పాత్రలో నటించిన 1920 చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. లెజెండరీ ఫిల్మ్ మేకర్ మహేష్ భట్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 23న విడుదలకానుంది.

King Nagarjuna: నిజంగా భయపడ్డాను.. అందుకే నవ్వాను
King Nagarjuna

లెజెండరీ ఫిల్మ్ మేకర్ మహేష్ భట్ (Mahesh Bhatt) సమర్పణలో ఆయన స్వీయ రచనలో రూపొందిన హారర్ మూవీ ‘1920: హార్రర్స్ ఆఫ్ ది హార్ట్’ (1920: Horrors of the Heart). అవికా గోర్ (Avika Gor) ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి కృష్ణ భట్ (Krishna Bhatt) దర్శకత్వం వహించారు. విక్రమ్ భట్ ప్రొడక్షన్‌పై రాకేష్ జునేజా, శ్వేతాంబరీ భట్, డా. రాజ్‌కిషోర్ ఖవ్రే నిర్మించారు. జూన్ 23న ఈ చిత్రం తెలుగులో సైతం విడుదల కానున్న నేపధ్యంలో.. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి కింగ్ అక్కినేని నాగార్జున (King Akkineni Nagarjuna) ముఖ్య అతిథిగా హాజరై.. ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

అనంతరం జరిగిన మీడియా సమావేశంలో కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. ‘‘మహేష్ భట్‌గారిని కలిసి దాదాపు ఇరవై ఏళ్ళయింది. కానీ ఆయన నా మనసులో ఎప్పుడూ ఉంటారు. నేను కూడా ఆయన మనసులో ఉంటాననే నమ్ముతున్నాను. ముంబై షూటింగ్స్‌కి వెళితే భట్‌గారి గురించి అడుగుతుంటాను. ‘బ్రహ్మస్త్ర’ (Brahmastra) సినిమాలో ఆలియా భట్‌తో వర్క్ చేశాను. ఆ సమయంలో భట్‌గారి గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. భట్‌గారు నాకు గురువు. చాలా స్ఫూర్తిని ఇచ్చే వ్యక్తి. ఎంతో మందికి అవకాశాలు ఇచ్చి దారి చూపించారు. ఆయన పాటలు చేయించుకునే విధానం అద్భుతంగా వుంటుంది. ఇప్పటికీ ‘తెలుసా మనసా’ (Telusaa Manasaa) పాట చేయించిన విధానం గుర్తుకు వస్తుంటుంది. అలాగే ‘జకమ్’లో గలీ మే ఆజ్ చాంద్ నిక్లా పాట నా ఆల్ టైమ్ ఫేవరెట్. ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుకు వస్తున్నాయి. (1920 Horrors of the Heart Trailer)

Nagarjuna.jpg

ఇక సినిమా విషయానికి వస్తే.. 1920 ట్రైలర్ లాంచ్ చేయడం ఆనందంగా వుంది. ట్రైలర్ (1920 Movie Trailer) చూస్తున్నపుడు ఒక నిశ్శబ్దం వచ్చింది.. నిజంగా భయపడ్డాను. అందుకే దాన్ని పోగొట్టుకోవడానికే నవ్వాను(నవ్వుతూ). ఇలాంటి సినిమాని పెద్ద స్క్రీన్‌పైనే చూడాలి. వెయ్యికి పైగా స్క్రీన్స్‌లో ఈ సినిమా విడుదలవుతుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. నాకు హారర్ సినిమాలు చూడాలంటే భయం. కానీ ఈ సినిమా చూడాలనిపిస్తుంది.. చూడాలనిపించేలా చేశారు. హారర్ సినిమాలు చూసినప్పుడు ఆ కిక్కే వేరు. కృష్ణ అద్భుతంగా తీశారు. అవికా గోర్ డిఫరెంట్ పాత్రలు చేస్తుంది. ఈ సినిమా తన కెరీర్‌లో పెద్ద హిట్ కావాలి. జూన్ 23న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. తప్పకుండా అందరూ చూసి విజయవంతం చేయాలని కోరుతున్నాను’’ అని అన్నారు.

‘ఆదిపురుష్’కు ఆల్ ద బెస్ట్:

ఇంకా కింగ్ మాట్లాడుతూ.. ‘‘రేపు (జూన్ 16) ఒక పెద్ద సినిమా ప్రభాస్ ఆదిపురుష్ (Prabhas Adipurush) వస్తుంది. ప్రభాస్ అండ్ టీమ్‌కి ఆల్ ది బెస్ట్. ఈ సినిమా అందరినీ మళ్ళీ థియేటర్లలోకి తీసుకురావాలి’’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*Emraan Hashmi: పవన్ కళ్యాణ్ కోసం విలన్‌గా మారుతోన్న బాలీవుడ్ రొమాంటిక్ హీరో..


**************************************

*Anasuya: మొన్న బీచ్‌లో.. ఈసారి మామిడి తోటలో.. అనసూయ ఇలా అయితే కష్టం!

**************************************

*SJ Suryah: అమితాబ్ బచ్చన్‌ హీరోగా సినిమా ప్లాన్ చేశాను కానీ..


**************************************

*Urvashi: విలేకరులారా.. తప్పకుండా ఆ ప్రశ్న అడగండి


**************************************

*Adipurush: ఏపీ ప్రభుత్వం కూడా గుడ్ న్యూస్ చెప్పింది కానీ..

**************************************

Updated Date - 2023-06-15T21:45:18+05:30 IST