‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’కు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
ABN, Publish Date - May 04 , 2026 | 08:30 AM
త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీష్ కురువిల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. ఈ చిత్ర విడుదల తేదీ ఫిక్సయింది.
త్రిగుణ్ (Thrigun), పాయల్ రాధాకృష్ణ (Payal Radhakrishna), అనీష్ కురువిల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ (Mr. Work From Home). ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అరవింద్ మండ్యం నిర్మించారు. సిహెచ్.వి.ఎస్.ఎన్. బాబ్జీ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా, సినిమాను మే 15న (Mr. Work From Home Release Date) గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ తెలియజేశారు. శ్రీ వెంకట సాయి ఫిల్మ్స్ ముత్యాల రామదాస్ డిస్ట్రిబ్యూషన్‌లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ఫ్యూచర్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా ఉండబోతోందనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమా చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని తెలిపారు. అంతేకాదు, ఒక అందమైన ప్రేమకథ కూడా ఇందులో ఉందని, ప్రేక్షకులను ఆకర్షించేలా ఈ ప్రేమకథను దర్శకుడు డిజైన్ చేశారని అన్నారు. నిజాయితీ గల అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకుంటే ఆ ప్రయాణం ఎంత వినోదాత్మకంగా ఉంటుందో ఈ సినిమాలో దర్శకుడు అద్భుతంగా చూపించబోతున్నారని, ఈ హృద్యమైన కుటుంబ కథా చిత్రం సమ్మర్‌లో ప్రేక్షకులకు సంపూర్ణ వినోదాన్ని అందిస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. నెల్లూరు సుదర్శన్, హర్ష చెముడు, గుండు సుదర్శన్ వంటి వారు ఇతర ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. త్వరలోనే ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు.
ఈ మూవీ త్రిగుణ్ కెరీర్‌కు ఎంతో కీలకమనే విషయం తెలియంది కాదు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ అందుకుంటానని ఆయన కూడా చెబుతున్నారు. చూద్దాం.. మే 15న ఏం జరుగుతుందో?
ఇవి కూడా చదవండి:
Varanasi: ‘వారణాసి’కి వాటర్ కొరత!.. మహేష్ సినిమాకు ప్రభుత్వం షాక్!
‘పెద్ది’తో ఫైట్‌కు మహేష్ బాబు ఓకే అంటాడా?
ఒకే వేడుకలో చైతూ-శోభిత, సమంత-రాజ్ జంటలు హల్చల్!