Thrigun: పెళ్లిపీటలు ఎక్కుతోన్న మరో టాలీవుడ్ యంగ్ హీరో..

ABN , First Publish Date - 2023-09-02T17:52:28+05:30 IST

టాలీవుడ్‌లోని యంగ్ హీరోలు ఒక్కొక్కరుగా పెళ్లిపీటలు ఎక్కే ప్రయత్నాల్లో ఉన్నారు. ‘కథ’ అనే సనిమాతో సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన త్రిగుణ్.. ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యాడు. ‘పీఎస్వీ గరుడ వేగ, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, డియర్ మేఘ’ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న త్రిగుణ్.. ఇప్పుడో ఇంటివాడు కాబోతున్నాడు.

Thrigun: పెళ్లిపీటలు ఎక్కుతోన్న మరో టాలీవుడ్ యంగ్ హీరో..
Thrigun and Nivedita

టాలీవుడ్‌లోని యంగ్ హీరోలు ఒక్కొక్కరుగా పెళ్లిపీటలు ఎక్కే ప్రయత్నాల్లో ఉన్నారు. ‘కథ’ అనే సనిమాతో సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన త్రిగుణ్.. ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యాడు. ‘పీఎస్వీ గరుడ వేగ, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, డియర్ మేఘ’ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న త్రిగుణ్ (Thrigun).. ఇప్పుడో ఇంటివాడు కాబోతున్నాడు. నివేదిత అనే అమ్మాయిని సెప్టెంబర్ 3న ఆయన పరిణయమాడబోతున్నాడు. త్రిగుణ్, నివేదిత‌ల పెళ్లికి సంబంధించిన వివరాలు అధికారికంగా తెలియజేశారు. (Thrigun Weds Nivedita)


సెప్టెంబర్ 3, ఆదివారం తమిళనాడు‌ (Tamil Nadu)లోని తిరుపుర్‌లో శ్రీ సెంతుర్ మహల్‌లో బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి జరగనుంది. ఈ పెళ్లికి సంబంధించి అంతా ముస్తాబైనట్లుగా తెలుస్తోంది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమే. శనివారం సాయంత్రం ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్.. ఆదివారం ఉదయం మ్యారేజ్ జరగనుంది. ఈ వేడుకకు సినీ ప్రముఖులతో పాటు.. కొందరు రాజకీయ నాయకులు కూడా హాజరు కాబోతున్నట్లుగా సమాచారం.

Thrigun-1.jpg

త్రిగుణ్ విషయానికి వస్తే.. అరుణ్ అదిత్‌ (Arun Adith)గా తెలుగు, తమిళ్‌లో కొన్ని సినిమాలు చేసిన అనంతరం.. 2022లో తన పేరును త్రిగుణ్‌గా మార్చుకున్నారు. ఆయన పేరు మార్చుకున్న తర్వాత చేసిన చిత్రం రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘కొండా’ (Kondaa) చిత్రం కావడం విశేషం. ప్రస్తుతం తెలుగు, తమిళ్‌లో పలు చిత్రాల్లో త్రిగుణ్ నటిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Pawan Kalyan: ఈ రోజుల్లో ఎవడున్నాడ్రా.. ఇలాంటోడు!

*************************************

*Bhagavanth Kesari: హైలీ ఎనర్జిటిక్ గణేష్ సాంగ్‌లో బాలయ్య, శ్రీలీల.. అరుపులే!!

**************************************

*Miss Shetty Mr Polishetty: సెన్సార్ పూర్తి.. ఇక తెరపై చూసుకుందాం

*************************************

*Salaar: ‘సలార్’ వాయిదా పడనుందా? తీవ్ర నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్

*************************************

Updated Date - 2023-09-02T17:52:28+05:30 IST