‘మాయలేడి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. నవంబర్ 13న థియేటర్లలోకి రాకేష్ వర్రే మూవీ

ABN , Publish Date - Oct 22 , 2026 | 11:43 PM

రాకేష్ వర్రే హీరోగా, క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ‘మాయలేడి’ నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రశంకర్ దర్శకత్వంలో మధుమిత సర్కార్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా టీజర్, పాటలు ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచాయి.

Maya Lady Movie

యంగ్ టాలెంటెడ్ హీరో, ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే చేస్తున్న కొత్త సినిమా 'మాయలేడి'. ఈ సినిమాలో రాకేష్ వర్రే హీరోగా నటిస్తూ క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రాకేష్ వర్రే గతంలో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై 'ఎవరికీ చెప్పొద్దు, పేకమేడలు' వంటి కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ నిర్మించి అందరి ప్రశంసలు పొందారు. ఇప్పుడు 'మాయలేడి'తో మరో ఇంట్రెస్టింగ్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాను దర్శకుడు ప్రశంకర్ రూపొందిస్తున్నారు. మధుమిత సర్కార్ హీరోయిన్ గా నటిస్తోంది. గురువారం సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. నవంబర్ 13న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ప్రమోషనల్ కంటెంట్ తో ఈ సినిమా ఇప్పటికే మూవీ లవర్స్ లో చక్కని బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్స్, టీజర్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. థియేటర్స్ లోనూ ప్రేక్షకుల నుంచి ఇలాంటి ఆదరణే తమ సినిమాకు దక్కుతుందనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు మూవీ టీమ్.

ఇవి కూడా చదవండి:

నిజమైన హీరోలేనా.. లేక ‘డూప్’లా? ‘జైలర్ 2’తో మొదలైన కొత్త చర్చ

‘రామాయణ’ టికెట్ ధరలు.. దిల్ రాజు కీలక నిర్ణయం

స్టార్ హీరోతో ప్రభుదేవా సినిమా.. దర్శకుడిగా టాలీవుడ్‌ రీఎంట్రీ

Updated Date - Oct 22 , 2026 | 11:46 PM

అమితాబ్ బచ్చన్‌కు ఏమైంది? ఆరోగ్యంపై బిగ్ బీ పోస్ట్.. అభిమానుల్లో ఆందోళన

‘కిల్లర్’ సెకండాఫ్ ట్విస్ట్ చెప్పండి.. రూ. కోటి గెలుచుకోండి: దర్శకుడు పూర్వాజ్

అల్లు అర్జున్‌కి అర్ధరాత్రి విజయ్ దేవరకొండ ఫోన్.. అసలేం జరిగిందంటే

ఈ వారాంతంలో ఐదు సినిమాలు!

బాక్సాఫీస్ వద్ద రజనీ రుద్రతాండవం.. జైలర్ 2 రికార్డుల వేట!