బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న సూరి, సుహాస్.. ‘మండాడి’ కలెక్షన్ల సునామీ
ABN, Publish Date - Sep 16 , 2026 | 04:04 PM
టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సుహాస్, కోలీవుడ్ సెన్సేషనల్ స్టార్ సూరి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మండాడి’.. ఊహించని కలెక్షన్లతో దూసుకెళుతోంది.
టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సుహాస్ (Suhas), కోలీవుడ్ సెన్సేషనల్ స్టార్ సూరి (Soori) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మండాడి’ (Mandaadi). ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహించారు. మహిమా నంబియార్, సీనియర్ నటుడు సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ప్రతిష్టాత్మక మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి సెప్టెంబర్ 10న గ్రాండ్‌గా విడుదల చేసింది. తొలి ఆట నుంచే అద్భుతమైన మౌత్ టాక్ దక్కించుకున్న ఈ చిత్రం ప్రస్తుతం రికార్డు స్థాయి వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.
తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన అన్ని కేంద్రాల్లో ‘మండాడి’ ప్రభంజనం సృష్టిస్తోంది. తాజాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 65 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను (Mandaadi Collections) సాధించినట్లు నిర్మాతలు అధికారిక పోస్టర్ ద్వారా ప్రకటించారు. విడుదలైన అతి తక్కువ సమయంలోనే ఈ రేంజ్ కలెక్షన్లు రాబట్టడం ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. లాంగ్ రన్‌లో ఈ సినిమా మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయమని.. సూరి, సుహాస్‌ల కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా ‘మండాడి’ నిలుస్తుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
సినిమాలో వచ్చే బోట్ సీక్వెన్స్‌లు, హై-వోల్టేజ్ రేసింగ్ ఎపిసోడ్లు ఒళ్లు గగుర్పొడిచేలా ఉండి ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ సంయుక్తంగా కంపోజ్ చేసిన యాక్షన్ సీన్లు థియేటర్లలో ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌పై కూర్చోబెడుతున్నాయి. వీటికి తోడు కథిర్ అందించిన టాప్-నాచ్ సినిమాటోగ్రఫీ, జీవీ ప్రకాష్ కుమార్ సమకూర్చిన అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. కథను నడిపించిన తీరుతో పాటు సూరి, సుహాస్‌ల నేచురల్ యాక్టింగ్, వారి మధ్య సాగే సన్నివేశాలు చిత్రానికి వెన్నెముకగా నిలిచాయి. ఇప్పటికే ఈ చిత్రాన్ని చూసిన సూపర్ స్టార్ రజనీకాంత్, దిగ్గజ దర్శకుడు వెట్రిమారన్ వంటి సినీ ప్రముఖులు సైతం సినిమాపై ప్రశంసల జల్లు కురిపించడంతో ‘మండాడి’ క్రేజ్ మరింత రెట్టింపైంది.
ఇవి కూడా చదవండి!
నాడు అడుగేస్తే చప్పట్లు.. నేడు జైలులో ఊచలు
'కిల్లర్' మేకర్స్ సూపర్ షీ ఛాలెంజ్!
Disha Patani: పండగ ఏదైనా సరే.. అందాల ఆరబోత చేయాల్సిందే