నాడు అడుగేస్తే చప్పట్లు.. నేడు జైలులో ఊచలు
ABN , Publish Date - Sep 16 , 2026 | 03:31 PM
ఒకప్పుడు డ్యాన్స్ స్టేజ్‌పై తన ప్రతిభతో చప్పట్లు కొట్టించుకున్నాడు. ఢీ-10 షో విన్నర్‌గా వెలుగులోకి వచ్చినా ఆ డ్యాన్సర్ ఇప్పుడు లైంగిక వేధింపుల కేసులో మార్మోగుతున్నాడు.
ఒకప్పుడు డ్యాన్స్ స్టేజ్‌పై తన ప్రతిభతో చప్పట్లు కొట్టించుకున్నాడు. ఢీ-10 షో (DHEE SHOW) విన్నర్‌గా వెలుగులోకి వచ్చినా ఆ డ్యాన్సర్ ఇప్పుడు లైంగిక వేధింపుల కేసులో మార్మోగుతున్నాడు. అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన రాజు (RAJU)కు సంబంధించి ఓ ఆడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇద్దరి మధ్య అసలు ఏం జరిగింది..?
ఒకప్పుడు డ్యాన్స్ స్టేజ్‌పై అడుగేస్తే చప్పట్లు మోగాయి.. ఢీ-10 విజేతగా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత టీవీ షోలు.. డ్యాన్స్ ప్రోగ్రామ్స్.. సెలబ్రిటీ ఇమేజ్.. కానీ ఇప్పుడు.. జైలులో ఊచలు లెక్కపెడుతున్నాడు. లైంగిక వేధింపుల కేసులో మార్మోగుతున్న ఢీ-10 విన్నర్ రాజుదిగా చెబుతోన్న ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఆడియోలో వినిపిస్తున్న మాటలు.. ఇద్దరి మధ్య అసలు ఏం జరిగింది అనే ప్రశ్నలను మరింత పెంచుతున్నాయి. ఇక నుంచి మనం ఫ్రెండ్స్‌లా ఉందాం.. ఈ రిలేషన్ వద్దంటూ రాజు మాట్లాడుతున్నట్లుగా ఆడియోలో వినిపిస్తోంది. రాజు మాత్రం.. తాను ఆమెను కేవలం ఫ్రెండ్‌గానే చూశానని.. ప్రేమ, పెళ్లి తనకు ఇష్టం లేదని చెప్పినట్టుగా ఆడియో ఉంది. ఇదే ఇప్పుడు ఈ కేసులో మరో కీలక అంశంగా మారింది.
హైదరాబాద్ మియాపూర్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్... అదే భవనంలో ఓ యువతి బోటిక్ నిర్వహిస్తోంది. ఆమె చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో.. మేనమామ వద్ద పెరిగినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఇదే భవనంలోని ఐదో అంతస్తులో ‘ఢీ’ ఫేమ్ చిట్టి మాస్టర్‌కు చెందిన డ్యాన్స్ స్టూడియో ఉంది. డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం రాజు తరచూ అక్కడికి వచ్చేవాడని తెలుస్తోంది. అలా.. ఒకే భవనం.. తరచూ ఎదురుపడటం.. పరిచయం... ఆ పరిచయం క్రమంగా స్నేహంగా మారిందని.. ఆ తర్వాత ఫోన్ కాల్స్, మెసేజ్‌లతో ఇద్దరూ మరింత దగ్గరయ్యామని బాధితురాలు చెబుతోంది.
అది 2026 మే నెల.. రాత్రి సమయం.. ఎవరూ లేని సమయంలో తనకు ఆరోగ్యం బాగోలేదని, కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలని రాజు చెప్పాడని బాధితురాలు ఆరోపించింది. ఆ సమయంలో జరిగిన పరిణామాలపై కూడా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్కడి నుంచి ఈ బంధం మరింత సన్నిహితంగా మారిందని... తాను పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతోనే ముందుకు వెళ్లానని ఆమె చెబుతోంది. సంవత్సరాలు గడిచాయి... ఒకటి కాదు... రెండు కాదు... దాదాపు పదేళ్ల కాలం గడిచిపోయింది. ఈ క్రమంలో పెళ్లి మాట ఎత్తగానే ముఖం చాటేశాడని ఫిర్యాదు చేసింది. ఇక తన దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని ఆరోపించింది. దీంతో చివరకు మియాపూర్ పోలీసులను ఆశ్రయించినట్లు చెబుతోంది.
బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. ఆమె చేసిన ఆరోపణలు, అందించిన ఆధారాలను పరిశీలించారు. ఈ నెల 9న కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణ అనంతరం డ్యాన్సర్ రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు రాజును జైలుకు తరలించారు. ఒకప్పుడు డ్యాన్స్ స్టేజ్‌పై విజేతగా నిలిచిన వ్యక్తి... ఇప్పుడు పోలీస్ కేసులో నిందితుడిగా రిమాండ్‌లో ఉన్నాడు.