Dish Patani: పండగ ఏదైనా సరే.. అందాల ఆరబోత చేయాల్సిందే

ABN , Publish Date - Sep 16 , 2026 | 12:15 PM

బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ గ్లామర్ అండ్ అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పండగ, పబ్బం, పార్టీ అనే తేడా లేకుండా ఎక్కడైనా సరే తన హాట్ అండ్ బోల్డ్ లుక్స్‌తో సందడి చేయడం ఈ భామకు అలవాటుగా మారింది.

Disha Patani

బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ (Dish Patani) గ్లామర్ అండ్ అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పండగ, పబ్బం, పార్టీ అనే తేడా లేకుండా ఎక్కడైనా సరే తన హాట్ అండ్ బోల్డ్ లుక్స్‌తో సందడి చేయడం ఈ భామకు అలవాటుగా మారింది. సోషల్ మీడియా పోస్టుల నుంచి పబ్లిక్ ఈవెంట్ల వరకు ఎల్లప్పుడూ తన గ్లామరస్ ఫోటోలతో నెట్టింట హల్‌చల్ చేసే దిశా, ఇటీవల మరోసారి తన దుస్తుల ఎంపికతో వార్తల్లో నిలిచింది.


మొన్నటికి మొన్న ప్రముఖ వ్యాపారవేత్త అంబానీ ఇంట్లో జరిగిన వినాయక చవితి వేడుకల్లో కూడా దిశా పటానీనే ప్రధాన హైలైట్‌గా మారింది. సాంప్రదాయబద్ధంగా జరుగతున్న పండగ ఈవెంట్ లో కూడా ఆమె మైండ్ బ్లాకింగ్ గ్లామర్ షోతో అందరి దృష్టినీ ఆకర్షించింది. క్లీవేజ్ షో స్పష్టంగా కనిపించేలా డిజైన్ చేసిన రెడ్ కలర్ లెహంగాలో ఈవెంట్‌కు హాజరైన దిశా లుక్ చూసి నెటిజన్లు తీవ్రంగా ఆశ్చర్యపోయారు. భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండగ వాతావరణంలో ఇలాంటి బోల్డ్ అవుట్‌ఫిట్ ధరించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.


దిశా పటానీ షేర్ చేసిన ఈ వినాయక చవితి ఈవెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెపై తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. పండగ పూట వేసుకునే దుస్తులు ఇవేనా?, కనీసం పూజలు, పండగల రోజైనా పద్ధతిగా రాకూడదా? అంటూ ఆమెను టార్గెట్ చేస్తూ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. ఒక పవిత్రమైన వేడుకకు హాజరవుతున్నప్పుడు సంస్కృతీ సంప్రదాయాలను గౌరవిస్తూ దుస్తులు ధరించాలని నెటిజన్లు ఆమెకు హితవు పలుకుతున్నారు.


అయితే, దిశా పటానీకి ఇలాంటి ట్రోలింగ్, విమర్శలు కొత్తేమీ కావు. గతంలో కూడా పలు పండగలు, సినీ వేడుకల్లో ఆమె వేసుకున్న బోల్డ్ డ్రెస్‌లపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా ఆమె మాత్రం తన సొంత ఫ్యాషన్ స్టైల్‌కే ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతుంది. గ్లామర్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన దిశా, ఈ వివాదాలపై స్పందిస్తుందో లేక ఎప్పటిలాగే లైట్ తీసుకుంటుందో వేచి చూడాలి.

Updated Date - Sep 16 , 2026 | 12:15 PM