సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

పరిష్కారం కోసమా? పరువు తీసుకోవడానికా?.. ఇండస్ట్రీ రచ్చ‌పై మధుర శ్రీధర్

ABN, Publish Date - May 13 , 2026 | 08:33 PM

టాలీవుడ్‌లో జరుగుతున్న పరిణామాలపై నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఆయన పోస్ట్‌కు నెటిజన్లు కూడా ఆసక్తికరంగా రియాక్ట్ అవుతున్నారు.

Producer Madhura Sreedhar Reddy

టాలీవుడ్‌లో జరుగుతున్న పరిణామాలపై నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి (Madhura Sreedhar Reddy) ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్, ప్రొడ్యూసర్స్ గిల్డ్ వంటి వ్యవస్థలు ఉండి కూడా సమస్యలను పరిష్కరించుకోలేకపోతున్నామని, మీడియా సమావేశాలు నిర్వహించి రచ్చ రచ్చ చేస్తూ, ప్రతీది బ్రేకింగ్ న్యూస్‌గా మార్చుతున్నారంటూ ఆయన స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు. ఈ రచ్చ వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి? అంటూ ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన చేసిన పోస్ట్‌లో..


‘‘నిన్న థియేటర్ల యజమానులు, పంపిణీదారులు మీడియా సమావేశం పెట్టారు. ఈరోజు నిర్మాతలు మీడియా ముందుకు వచ్చారు. రేపు ఇంకెవరో ఒకరు మైక్ పట్టుకుని కూర్చుంటారు. నిజాయతీగా ఆలోచిస్తే.. ఈ ‘పబ్లిక్ డ్రామా’తో మనం సాధిస్తున్నది ఏమిటి? ఇండస్ట్రీకి దీనివల్ల ఒరిగే ప్రయోజనం ఏంటి? మనకు ఫిలిం ఛాంబర్ ఉంది, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఉంది. ఇన్ని వ్యవస్థలు ఉన్నప్పుడు, సమస్యలు ఏవైనా ఉంటే ఒకే టేబుల్ మీద కూర్చుని అంతర్గతంగా ఎందుకు పరిష్కరించుకోలేకపోతున్నాం? ప్రతి చిన్న అసమ్మతిని ‘బ్రేకింగ్ న్యూస్’గా మార్చడం వెనుక అంతరార్థం ఏమిటి?


ఇటీవల అల్లరి రవిబాబు అన్నట్టు.. మనల్ని మనం మరీ ఎక్కువగా ఊహించుకుంటూ అనవసరమైన రచ్చ చేస్తున్నాం. ఆయన మాటల్లో చెప్పాలంటే, ‘తిప్పి తిప్పి కొడితే మన ఇండస్ట్రీ మొత్తం రెవెన్యూ, ఒక టాప్ రోడ్ కాంట్రాక్టర్ చేసే బిజినెస్ కన్నా పెద్దదేమీ కాదు’ కానీ.. మనమేదో ప్రపంచాన్ని మార్చేసే భారీ కార్పొరేట్ యుద్ధం చేస్తున్నట్టు ప్రతిరోజూ మీడియాలో హడావుడి చేస్తున్నాం. సినిమా రంగం అంటే ప్రజల్లో ఎంతో కొంత గౌరవం, ఆసక్తి ఉంటాయి. కానీ ఇలాంటి పరస్పర విమర్శలు, రోడ్డు మీద పడే రచ్చల వల్ల.. సామాన్య ప్రజల దృష్టిలో మన ఇండస్ట్రీని మనమే చిన్నచూపు చూసేలా చేసుకుంటున్నాం. వ్యవస్థల మీద నమ్మకాన్ని పోగొట్టుకుంటూ, సమస్యలను జటిలం చేసుకుంటున్నాం తప్ప పరిష్కారాల వైపు అడుగులు వేయడం లేదు..’’ అంటూ నిర్మాత మధుర శ్రీధర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ట్వీట్‌కు నెటిజన్లు కూడా ఆసక్తికరంగా రియాక్ట్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి:

అప్పుడు ‘హరి హర వీరమల్లు’కి.. ఇప్పుడు ‘పెద్ది’కి! - మైత్రీ రవిశంకర్

Prabhas: ‘బాహుబలి’ ప్రభాస్ చేసిన ఈ పని తెలిస్తే.. ఫ్యాన్ అయిపోవాల్సిందే!

రాజీనామా.. నట్టి కుమార్ సంచలన నిర్ణయం

పవన్ కళ్యాణ్, విజయ్‌ల విజయ రహస్యం అదే: ఆర్జే బాలాజీ

Updated Date - May 13 , 2026 | 08:38 PM