'మారెమ్మ' పాటలో పల్లెటూరి మట్టివాసన!

ABN , Publish Date - Apr 14 , 2026 | 11:03 AM

రవితేజ సోదరుడు రఘు కొడుకు మాధవ్‌ హీరోగా నటిస్తున్న సినిమా 'మారెమ్మ'. ప్రశాంత్‌ విహారి సంగీతం అందిస్తున్న ఈ సినిమానుండి 'బావా... బావా' అనే గీతం విడుదలైంది.

Maremma Movie

మాస్ మహారాజా రవితేజ సోదరుడు, నటుడు రఘు తనయుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా 'మారెమ్మ'తో హీరోగా బిగ్ స్క్రీన్ పై అడుగు పెడుతున్నారు. ఈ చిత్రంతో మంచాల నాగరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మయూర్ రెడ్డి బండారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌, టీజర్‌ విడుదలయ్యాయి. తాజాగా 'మారెమ్మ' నుండి ఫస్ట్ సింగిల్ 'బావ బావ' సాంగ్‌ని రిలీజ్ చేశారు మేకర్స్.


ప్రశాంత్ ఆర్ విహారి స్వరపరిచిన ఈ పాటలో పల్లెటూరి మట్టి వాసనతో పాటు మోడరన్ మ్యూజిక్ లేయర్స్ మిళితమై ఎంతో మధురమైన అనుభూతిని కలిగిస్తోంది. ప్లజెంట్ ఫీల్‌ను అందించేలా ఈ పాట సాగిన తీరు ఆకట్టుకుంటోంది. బావపై ఉన్న ఆప్యాయతను ఎంతో సింపుల్‌గా, హృదయానికి హత్తుకునేలా కమల్ ఎస్లవత్ సాహిత్యాన్ని అందించారు. శ్రుతి రంజని తన స్వరంలో ఉన్న నేచురల్, రస్టిక్ టచ్‌తో ఈ పాటకు ప్రాణం పోశారు. మాధవ్, దీపా బాలు మధ్య కనిపించే సహజమైన కెమిస్ట్రీ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వారి యాక్టింగ్‌లో ఉన్న సహజత్వం, పల్లెటూరి అందమైన లోకేషన్స్ కలిసి విజువల్స్‌ ట్రీట్ గా మార్చాయి. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ప్రశాంత్ అంకిరెడ్డి అందించగా, ఎడిటర్‌గా దేవ్ రాథోడ్, ఆర్ట్ డైరెక్టర్‌గా రాజ్‌కుమార్ మురుగేసన్ పని చేస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ త్వరలో అనౌన్స్ చేయనున్నారు.

Updated Date - Apr 14 , 2026 | 11:03 AM