Madhav Debuts: పల్లెటూరి మొనగాడు
ABN , Publish Date - Jul 08 , 2025 | 04:18 AM
హీరో రవితేజ సోదరుని కుమారుడు మాధవ్ మారెమ్మ అనే సినిమాతో కథానాయకునిగా పరిచయం అవుతున్నారు.
హీరో రవితేజ సోదరుని కుమారుడు మాధవ్ ‘మారెమ్మ’ అనే సినిమాతో కథానాయకునిగా పరిచయం అవుతున్నారు. మంచాల నాగరాజ్ దర్శకత్వంలో మోక్ష ఆర్ట్స్ బేనర్‌పై మయూర్ రెడ్డి బండారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్‌ని చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. పోస్టర్‌లో మాధవ్ గళ్ల చొక్కా, లుంగీ ధరించి, మెడలో టవల్‌తో ఓ పల్లెటూరి హీరోగా కనిపిస్తున్నారు. పోస్టర్ బ్యాక్‌డ్రా్‌పలో ఉన్న గేదె అతని బలం, ఆధిపత్యాన్ని సూచిస్తోంది. మాధవ్ పొడవాటి కర్రను పట్టుకొని ఏదైనా సవాలును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించారు. కాగా, సినిమాను గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రఫీ, ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు.