Madhav Raj: మారెమ్మ అంటోన్న.. రవితేజ వారసుడు
ABN , Publish Date - Jul 07 , 2025 | 07:07 AM
రవితేజ బ్రదర్ రఘు తనయుడు మాధవ్ రాజ్ భూపతి హీరోగా.. కొత్త చిత్రం ప్రారంభమవుతోంది.
మాస్ మహరాజ్ రవితేజ (Raviteja) తమ్ముడు రఘు కుమారుడు మాధవ్ (Madhav Raj Bhupathi) హీరోగా ఇప్పటికే 'మిస్టర్ ఇడియట్' (Mr Idiot) పేరుతో ఓ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. సిమ్రాన్ శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. జేజేఆర్ ఎంటర్ టైన్ మెంట్స్ ఎల్ఎల్ పీ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జె జే ఆర్ రవిచంద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పెళ్లి సందడి చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్ట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో విడుదల చేసిన పాటలు, టీజర్ అన్నీ ప్రేక్షకులను మెప్పించాయి.
అయితే.. ఇంకా ఆ సినిమా విడుదల కాక ముందే మాధవ్ హీరోగా మరో ఆసక్తికర చిత్రం పట్టాలెక్కనుంది ఇందుకు సంబంధించి మేకర్స్ ఆదివారం చిన్న అప్డేట్ ఇచ్చారు. మోక్ష ఆర్ట్స్ (Moksha Arts) నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ సోమవారం సాయంత్రం రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు నీ ప్రాణం, నా త్యాగం, అమ్మోరి కి అభిషేకం అంటూ విడుదల చేసిన ఓ పోస్టర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. కాగా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుందని నూతన డైరెక్టర్ నాగరాజు దర్శకత్వం వహించనున్నన్నాడు. ఇదిలాఉంటే ఈ సినిమాకు మారెమ్మ అనే టైటిల్‌ను సైతం ఫిక్స్ చేసినట్లు తెలుస్తుండగా ఆగస్టులో గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు సమాచారం.
మరోవైపు నితిన్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో బలగం వేణు రూపొందిస్తున్న సినిమాకు ఎల్లమ్మ అనే టైటిల్ ఉండడం తెలిసిందే. ఇప్పుడు మారెమ్మ అనే మరో గ్రామ దేవత పేరుతో సినిమా రానుండడంతో ఇక కొద్ది రోజుల పాటు ఈ దేవత పేర్లు ట్రెండింగ్‌లో ఉంటాయని, మైసమ్మ, పోచమ్మ, రేణుకా ఎల్లమ్మ, గంగమ్మ వంటి పేర్లతో సినిమాలు లైన్ కడుతాయనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి.