Samantha: బంగారం బాదేసింది.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
ABN , Publish Date - Jun 20 , 2026 | 02:39 PM
ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘మా ఇంటి బంగారం’. ఈ మూవీ ఫస్ట్ డే రాబట్టిన కలెక్షన్లతో సమంత చాలా హ్యాపీగా ఉన్నారు.
ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ పై సమంత (Samantha), రాజ్ నిడిమోరు (Raj Nidimoru), హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaaram). టాలెంటెడ్ డైరెక్టర్ నందినీ రెడ్డి (Nandini Reddy) దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. చాలా గ్యాప్ తర్వాత సమంత నటించిన చిత్రం కావడంతో.. ఆమెను చూసేందుకు థియేటర్ల వద్ద ప్రేక్షకుల సందడి నెలకుంది. ముఖ్యంగా సమంత యాక్షన్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌కు, నందినీ రెడ్డి టేకింగ్‌కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.
ఈ పాజిటివ్ వేవ్స్ బాక్సాఫీస్ కలెక్షన్లపై గట్టిగానే ప్రభావం చూపించాయి. మొదటి రోజే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 13.15 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ (Maa Inti Bangaaram 1st Day Collections) రాబట్టి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ఈ స్థాయి ఓపెనింగ్స్ రావడం చూస్తుంటే.. టాలీవుడ్‌లో సమంత రేంజ్ ఏంటో మరోసారి నిరూపించింది. ‘బ్లాక్‌బస్టర్ బంగారం’ అంటూ మేకర్స్ రిలీజ్ చేసిన అఫీషియల్ కలెక్షన్ల పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టర్‌లో.. చేతిలో గన్ పట్టుకుని శారీ లుక్‌లో సమంత కనిపిస్తున్న ఈ రగ్గడ్ పోస్టర్ సినిమాలోని ఇంటెన్సిటీని తెలియజేస్తోంది.
సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చాయంటూ రివ్యూలు వస్తున్నాయి. టాక్‌తో పాటు.. వీకెండ్ కావడంతో ఈ సినిమాకు కలెక్షన్ల జోరు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక మొదటిరోజు వచ్చిన కలెక్షన్లతో సమంత కూడా చాలా హ్యాపీగా ఉన్నట్లుగా, ఎక్స్ వేదికగా ఆమె చేసిన పోస్ట్ చూస్తుంటే తెలుస్తోంది.
‘‘ఒక సినిమాకు మొదటి రోజునే ఇంతటి ఘనమైన ఓపెనింగ్స్ రావడం చూస్తుంటే మనసు ఎంతో గౌరవంతో నిండిపోతోంది. సినిమాలో హీరో ఉన్నాడా లేక హీరోయిన్ ఉందా అనే భేదం లేకుండా, కేవలం కథను చూసి ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అలాగే వయసుతో నిమిత్తం లేకుండా పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ థియేటర్లకు వచ్చి, ఈ సినిమా విడుదలను మనస్ఫూర్తిగా సెలబ్రేట్ చేసుకోవడం చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంది. వీటన్నిటికంటే ఎక్కువగా నన్ను సంతోషపెట్టిన విషయం ఏంటంటే.. మొదటి రోజు కలెక్షన్లలో మహిళా ప్రేక్షకుల సహకారం ఎక్కువగా ఉండటం. థియేటర్లలో ఓపెనింగ్స్ అంటే కేవలం పురుష ప్రేక్షకుల వల్లే వస్తాయని చాలా కాలంగా వింటున్నాం. కానీ, ఇప్పుడు సినిమాను ఆదరించే ప్రేక్షకుల పరిధి ఇలా మరింతగా విస్తరిస్తూ, మారుతూ ఉండటం అద్భుతంగా అనిపిస్తోంది. మా చిన్న నిర్మాణ సంస్థ అనుకున్నది సాధించింది’’ అంటూ ట్రాలాలా డ్యాన్స్ ఈమోజీలను షేర్ చేశారు సమంత. ప్రస్తుతం ఆమె ట్వీట్ వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి:
‘OG 2’లో ఊహించని మార్పులు.. షూటింగ్ డేట్ ఫిక్స్!
పవన్ అభిమాని నిరంజన్‌ను ఈ రోజే కలవడానికి కారణమిదే: బండ్ల గణేష్
మాట నిలబెట్టుకున్న థమన్.. ఎంత గొప్ప మనసో!
రుక్మిణి వసంత్ మార్ఫింగ్ ఫొటోలు.. ముగ్గురు అరెస్ట్!