సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘M4M’ న్యూ రికార్డ్.. సక్సెస్‌ఫుల్‌గా రెండో వారంలోకి ఎంట్రీ!

ABN, Publish Date - May 16 , 2026 | 01:54 PM

సరికొత్త సైకలాజికల్ క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘M4M’ (మోటివ్ ఫర్ మర్డర్) చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. ఓవర్సీస్‌లో ఈ సినిమా ఆన్-డిమాండ్ మోడ్‌లో ప్రదర్శితమవుతోంది.

M4M Movie Latest Update

సరికొత్త సైకలాజికల్ క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘M4M’ (మోటివ్ ఫర్ మర్డర్) చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. మోహన్ వడ్లపట్ల (Mohan Vadlapatla) దర్శకత్వంలో, అమెరికన్ నటి జో శర్మ (Jo Sharma) ప్రధాన పాత్రలో మోహన్ మీడియా క్రియేషన్స్, మెక్‌విన్ గ్రూప్ యూఎస్ఏ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం.. సక్సెస్‌ఫుల్‌గా రెండో వారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో 15 అవార్డులను గెలుచుకుని, కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమై ప్రశంసలు అందుకున్న ఈ సినిమా, థియేటర్లలోనూ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని పరిమిత థియేటర్లలో సక్సెస్‌ఫుల్ రన్‌ను కొనసాగిస్తూ.. బాలీవుడ్ సర్కిల్స్‌లో సైతం సక్సెస్ సెలబ్రేషన్స్‌ను ఈ చిత్రం జరుపుకుంటోంది.


ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ ‘M4M’ మూవీ భారీ క్రేజ్ సొంతం చేసుకుంటోంది. అమెరికాలోని తెలుగు, హిందీ అసోసియేషన్ల ప్రేక్షకుల నుంచి వస్తున్న భారీ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈ వీకెండ్ నుంచి యూఎస్ఏలోని ప్రధాన నగరాల్లో గ్రాండ్ స్కేల్‌లో సక్సెస్ సెలబ్రేషన్స్, ప్రత్యేక స్క్రీనింగ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా బే ఏరియా (శాన్ ఫ్రాన్సిస్కో)లో రెడ్ కార్పెట్ ఈవెంట్‌తో పాటు మూవీ సక్సెస్ షోను ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ప్రముఖ హిందీ ఆర్గనైజేషన్ FIA/FOG (ఫెడరేషన్ ఆఫ్ ఇండో-అమెరికన్ అసోసియేషన్ / ఫెస్టివల్ ఆఫ్ గ్లోబ్) కన్వీనర్ డాక్టర్ రమేష్ జప్రా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన ఆధ్వర్యంలో 200 మంది అతిథుల సమక్షంలో ‘M4M’ మూవీ సక్సెస్ రెడ్ కార్పెట్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో సినిమా చూసిన వారంతా ప్రశంసలు కురిపిస్తూ, మేకర్స్‌ని అభినందించారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.


ఇక మే 16 శనివారం రోజున లాస్ ఏంజిల్స్ (హాలీవుడ్)లోని ప్రముఖ ఏఎమ్‌సీ (AMC) థియేటర్లో 200 మంది సామర్థ్యం గల హాల్‌ను బుక్ చేసి, ‘దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం’ (TASC) ఆధ్వర్యంలో మూవీ స్క్రీనింగ్, గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా డాక్టర్ ప్రేమ్ రెడ్డి, గౌరవ అతిథిగా చిత్ర కథానాయిక జో శర్మ హాజరవుతున్నారు. అలాగే మే 17 ఆదివారం నాడు చికాగోలోని సినీ లాంజ్‌లో 100 మంది కెపాసిటీ గల థియేటర్లో ఆన్-డిమాండ్ సక్సెస్ షో జరగనుంది. ఈ వేడుకకు ఇఫ్తకర్ షరీఫ్ (మొదటి ఇండియన్ OCI గ్రహీత) స్పాన్సర్‌గా వ్యవహరిస్తుండగా.. మరొక ముఖ్య అతిథిగా కేకే రెడ్డి (ATA కన్వెన్షన్ డైరెక్టర్ / బిజినెస్ మెన్) హాజరుకానున్నారు. రాబోయే రోజుల్లో డల్లాస్, డెట్రాయిట్ నగరాలతో పాటు.. వచ్చే వారం బే ఏరియాలో మరికొన్ని ప్రత్యేక ప్రదర్శనలు, విజయోత్సవాలు జరపడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Keneeshaa: 4 నెలల బిడ్డను కోల్పోయిన నేను.. జయం రవి జీవితం నాశనం చేస్తానా?

లవ్‌ - రిలేషన్‌‌పై మిల్కీ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు

Peddi Movie: రామ్ బుజ్జిగా దివ్యేందు శర్మ.. వీడియో వైరల్!

మోదీ ‘పొదుపు మంత్రం’.. కమల్ హాసన్ సంచలన ప్రకటన!

Updated Date - May 16 , 2026 | 03:14 PM