మా బావ రామ్ చరణ్‌కు థ్యాంక్స్ - లావణ్య త్రిపాఠి

ABN , Publish Date - May 02 , 2026 | 03:34 PM

లావ‌ణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన చిత్రం ‘సతీ లీలావతి’. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Lavanya Tripathi about Ram Charan support

లావ‌ణ్య త్రిపాఠి కొణిదెల (Lavanya Tripathi), దేవ్ మోహన్ (Dev Mohan) ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన చిత్రం ‘సతీ లీలావతి’ (Sathi Leelavathi). ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌(శివ మ‌న‌సులో శృతి)’ ఫేమ్ తాతినేని స‌త్య దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో శనివారం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేసి, చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. తను నటించిన మూవీ ట్రైలర్‌ను విడుదల చేసిన బావ రామ్ చరణ్‌ (Ram Charan)కు హైదరాబాద్‌లో జరిగిన ట్రైలర్ లాంచ్ వేడుకలో లావణ్య త్రిపాఠి థ్యాంక్స్ చెప్పారు.


ఈ కార్యక్రమంలో లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.. ‘సతీ లీలావతి’ సినిమా కోసం మేము పెట్టిన శ్రమ, మా ప్రేమ, మా కష్టం అంతా తెరపై ప్రేక్షకులు చూస్తారు. సత్య, ఉదయ్ మంచి కథను నా వద్దకు తీసుకొచ్చారు. సినిమా అద్భుతంగా వచ్చింది. ఈ చిత్రం కోసం నాగ మోహన్ చాలా కష్టపడ్డారు. నేను చిత్రీకరణ సమయంలో ప్రెగ్నెంట్ అని తెలిశాక.. టీం మొత్తం సపోర్ట్ చేసింది. దేవ్ సొంతంగా డబ్బింగ్ చెప్పారు. మా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన మా బావ రామ్ చరణ్‌కు థ్యాంక్స్. ఆయన రిలీజ్ చేయడం వల్ల మా ట్రైలర్‌కి, మా సినిమాకు రీచ్ బాగా పెరిగింది. మా ట్రైలర్‌ని అందరూ చూసి సపోర్ట్ చేయండి. అలాగే మే 8న వస్తున్న మా సినిమాన అందరూ చూసి సపోర్ట్ చేయండని కోరారు.


ఇదే కార్యక్రమంలో మెగా కోడలిగా మెగా ఫ్యామిలీ గురించి ఆమె మాట్లాడుతూ.. ‘‘కామన్‌మ్యాన్ ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి తేడా ఏమీ లేదు. మా‌ ఫ్యామిలీ‌లో అందరూ డౌన్ టు ఎర్త్ పర్సన్సే. మా మధ్య కూడా అన్నీ కుటుంబాలలో ఉండే ఆప్యాయతలు, మాటలే ఉంటాయి. ప్రత్యేకంగా ఏవీ ఉండవు. వరుణ్ తేజ్ మంచి భర్త, మంచి తండ్రి.. అతను నాకు దొరకటం అదృష్టం’’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

‘నా పెళ్ళాం నిప్పు రా’.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోస్ట్ వైరల్!

తొక్కలో ఇంటర్వ్యూ.. అంటూ కుర్చీ విసిరేసి వెళ్లిపోయిన గెటప్ శ్రీను!

కయాదు లోహర్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

Updated Date - May 02 , 2026 | 03:34 PM

Lavanya Tripathi: అనుకున్న విధంగానే.. పెళ్లి చేసుకున్నాం: లావ‌ణ్య పోస్టు వైర‌ల్‌

Lavanya Tripathi: ఆకట్టుకుంటోన్న ‘సతీ లీలావతి’ ట్రైలర్

Lavanya Tripathi: పాపం.. లావణ్య త్రిపాఠికి కొత్త కష్టాలు..

Lavanya Tripathi: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు.. మెగా కోడ‌లు బెస్ట్‌ విషెష్‌!

Lavanya Tripati : కొత్త నిర్ణయం... మరింత వేగంగా!