మెగా కోడలి మూవీకి మరోసారి రిలీజ్ డేట్ మారింది.. ఎప్పుడంటే?

ABN , Publish Date - Apr 25 , 2026 | 11:18 AM

మెగా కోడలు లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించిన ‘సతీ లీలావతి’ చిత్రానికి సంబంధించి మరోసారి విడుదల తేదీ మారింది. ఫైనల్‌గా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది మేకర్స్ తెలిపారు.

Sathi Leelavathi Release Update

మెగా కోడలు లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) హీరోయిన్‌గా నటించిన ‘సతీ లీలావతి’ (Sathi Leelavathi) చిత్రానికి సంబంధించి మరోసారి విడుదల తేదీ మారింది. ఇప్పటికే రెండు మూడు సార్లు విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. కానీ, వారు ప్రకటించిన ఏ తేదీకి ఈ సినిమా విడుదల కాలేదు. ఈసారి మాత్రం పక్కాగా థియేటర్లలోకి వస్తుందని చెబుతూ, మేకర్స్ మరోసారి అధికారికంగా విడుదల తేదీని ప్రకటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రాన్ని మే 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ మేకర్స్ ఓ పోస్టర్ విడుదల చేశారు.


ఈ పోస్టర్‌లో హీరో దేవ్ మోహన్ (Dev Mohan), లావణ్య త్రిపాఠి ఒకరినొకరు పట్టుకుని, సరదాగా నవ్వుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌ (శివ మ‌న‌సులో శృతి)’ ఫేమ్ తాతినేని స‌త్య (Tatineni Satya) దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. ఫీల్ గుడ్ మూవీగా అందరినీ ఆకట్టుకునేలా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా రూపొందించామ‌ని ఈ అప్డేట్‌లో మేక‌ర్స్ తెలియ‌జేశారు.


రెండు వేర్వేరు కుటుంబాలు, నేప‌థ్యాల నుంచి వచ్చిన వ్యక్తులు క‌లిసి ప్రయాణించాలంటే.. వారి మ‌ధ్య ఎమోష‌న్స్ ఎంతో బలంగా ఉండాలి. ఇలాంటి సునిశిత‌మైన అంశాన్ని ఈ చిత్రంలో ద‌ర్శకుడు తాతినేని స‌త్య ఆవిష్కరించినట్లుగా తెలుస్తోంది. భార్యాభర్తల మ‌ధ్య ఉండే అనుబంధాన్ని ఎమోష‌నల్‌గానే కాకుండా ఎంట‌ర్‌టైనింగ్‌‌గా ఈ చిత్రంలో చూపించామని, కచ్చితంగా ప్రేక్షకులను ఈ సినిమా మెప్పిస్తుందని, చిత్రయూనిట్ నమ్మకంగా చెబుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా, త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్‌ని విడుదల చేయనున్నారు. ఈ మూవీకి మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

స్రవంతి చొక్కారపు.. చీరకట్టులో ఎంత అందంగా ఉందో!

అందుకే చిరు.. ‘ఠాగూర్’ సినిమాపై రాజశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు

‘పెద్ది’ రిలీజ్ డేట్.. మరోసారి ‘లెనిన్’ త్యాగం చేయాల్సిందేనా!

తమన్నాతో బ్రేకప్.. మరో యంగ్ బ్యూటీని పట్టిన విజయ్ వర్మ!

Updated Date - Apr 25 , 2026 | 11:19 AM

Sathi Leelavathi: మెగా కోడ‌లు.. సతీ లీలావతి టీజ‌ర్ అదిరింది

Lavanya Konidela: మెగాస్టార్ పై విమర్శలు.. ఇచ్చిపడేసిన మెగా కోడలు

Lavanya Tripathi Konidela: 'సతీ లీలావతి' నుండి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

Lavanya Tripathi: పోస్ట్ ప్రొడక్షన్ లో సతీ లీలావతి...

Lavanya Tripati : కొత్త నిర్ణయం... మరింత వేగంగా!