సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

వరుణ్‌ తేజ్‌తో మళ్లీ నటిస్తారా.. అంటే? లావణ్య సమాధానమిదే!

ABN, Publish Date - May 06 , 2026 | 10:36 PM

లావ‌ణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో.. ఆనంది ఆర్ట్స్ సమర్పిస్తూ, దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ నిర్మించిన చిత్రం ‘సతీ లీలావతి’. ఈ సినిమా ప్రమోషన్స్‌లో మెగా ఫ్యామిలీ విషయాలను లావణ్య పంచుకున్నారు.

Lavanya Tripathi about Mega Support

లావ‌ణ్య త్రిపాఠి కొణిదెల (Lavanya Tripathi Konidela), దేవ్ మోహన్ (Dev Mohan) ప్ర‌ధాన పాత్ర‌ల్లో.. ఆనంది ఆర్ట్స్ సమర్పిస్తూ, దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ నిర్మించిన చిత్రం ‘సతీ లీలావతి’ (Sathi Leelavathi). తాతినేని స‌త్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 8న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం హీరోయిన్ లావణ్య త్రిపాఠి మీడియాకు సినిమాకు సంబంధించిన విశేషాలతో పాటు మెగా ఫ్యామిలీ ముచ్చట్లు కూడా తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..


‘‘బావ రామ్ చరణ్ (Ram Charan) మాకు ఎప్పుడూ సపోర్టివ్‌గానే ఉంటారు. ఆయన ఎప్పుడూ.. ఏమైనా హెల్ప్ చేయాలా? హెల్ప్ కావాలా? అని అడుగుతూనే అడుగుతుంటారు. మా కోసం ఆయన ట్రైలర్ రిలీజ్ చేయడం సంతోషంగా అనిపించింది. ఆయన రిలీజ్ చేయడంతో మా సినిమాకు మరింత రీచ్ వచ్చింది. చిరంజీవి (Chiranjeevi) మామయ్య మా అందరినీ ఎంతో ఎంకరేజ్ చేస్తుంటారు. ఆయన్ను ప్రమోషన్స్‌కి పిలిస్తే కచ్చితంగా వస్తారు. మేం కూడా ఆయనకు ట్రైలర్ చూపించాలని అనుకుంటున్నాం. ప్రస్తుతం నాకు అవకాశాలు వస్తున్నాయి కానీ, ఒప్పుకోవడం లేదు. నేను నా ఫ్యామిలీకే టైం కేటాయించాలని అనుకుంటున్నాను. నా కొడుకుతోనే టైం సరిపోతోంది. కాస్త గ్యాప్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను.


వరుణ్‌ (Varun Tej)తో మళ్లీ కలిసి నటించాలని నాకు కూడా ఉంది. ఈ మధ్యే ఓ కథ కూడా వచ్చింది. కానీ మేం రియల్ లైఫ్‌లో కలిసే ఉంటున్నాం. తెరపైనా అలానే కనిపించాలంటే కథ కాస్త కొత్తగా, డిఫరెంట్‌గా ఉంటేనే చేయగలం. భవిష్యత్తులో అలాంటి కథ వచ్చినప్పుడు తప్పకుండా ఆలోచిస్తాం. ఇక ఈ ‘సతీ లీలావతి’ చిత్రం ఎంతో రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. ప్రేక్షకులందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. ఈ మూవీ కోసం నేను డబ్బింగ్ కూడా చెప్పారు. నేను కూడా సొంతంగా డబ్బింగ్ చెప్పాలనే ప్రయత్నిస్తున్నాను. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకోవడం ఆనందంగా ఉంటుంది. ఇందులో అందరూ అద్భుతంగా నటించారు. సినిమా చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. దీనిని కమల్ హాసన్ చిత్రంతో పోల్చలేం. అదొక క్లాసికల్ చిత్రం. ఆ చిత్రంతో మా సినిమాని పోల్చవద్దు’’ అని లావణ్య తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Peddi Movie: కథ విని, 20 నిమిషాల పాటు మనిషిని కాలేకపోయా- ప్రొడక్షన్ డిజైనర్

Lavanya Tripathi: ఇకపై ప్రెగ్నెంట్ అని తెలిస్తే.. ఆ పని చేయను

Peddi Movie: ‘పెద్ది’ విషయంలో బుచ్చిబాబు స్ట్రాటజీ ఏంటి? ఓన్లీ రామ్ చరణేనా!

‘సన్ రైజర్స్‌’కు సపోర్ట్ చేస్తున్న ఈ భామ ఎవరో గుర్తు పట్టారా?

Updated Date - May 06 , 2026 | 10:36 PM