సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అన్నీ ఉచితంగా.. సినీ రంగానికి ఆరోగ్యగ్రామం ఆహ్వానం

ABN, Publish Date - Oct 26 , 2026 | 09:34 PM

ఆరోగ్య స్పృహను ప్రజల్లోకి మరింత వేగంగా తీసుకెళ్లేందుకు సినీ మాధ్యమం ఎంతో ఉపయోగపడుతుందని భావించిన లక్ష్మణ్ పూడి.. చిత్ర పరిశ్రమలోని చిన్న నిర్మాతలు, దర్శకులు తమ సినిమా పూజా కార్యక్రమాలు, టీజర్ లేదా ట్రైలర్ లాంచ్‌లు, ప్రెస్‌మీట్‌లను లక్ష్మణ్ ఆరోగ్య గ్రామంలో నిర్వహించుకోవచ్చని ఆహ్వానించారు.

Lakshman’s Arogyagramam Event

మారుతున్న జీవనశైలి, విచ్చలవిడిగా పెరుగుతున్న ఆహార కల్తీ, శారీరక శ్రమ తగ్గిపోతున్న ప్రస్తుత రోజుల్లో.. సంపూర్ణ ఆరోగ్యకరమైన జీవన విధానం ఆవశ్యకతను చాటిచెబుతున్న ‘లక్ష్మణ్ ఆరోగ్య గ్రామం’ (Lakshman's Arogyagramam) విజయవంతంగా తొలి ఏడాదిని పూర్తి చేసుకుంది. ఆహారపు అలవాట్ల మార్పు నుంచి ప్రకృతి వ్యవసాయం వరకు, శారీరక దృఢత్వం నుంచి మానసిక ప్రశాంతత వరకు ప్రజల్లో సమగ్ర చైతన్యం తేవాలనే లక్ష్యంతో లక్ష్మణ్ పూడి ఎనిమిది ఎకరాల సువిశాల విస్తీర్ణంలో దీనిని స్థాపించారు. తాజాగా నిర్వహించిన ఈ ఆరోగ్య గ్రామం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్, అరుణోదయ విమలక్క, సుమన్ దూది ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే చిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖ నటుడు సప్తగిరి, కిరాక్ ఆర్‌పీ, ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ తదితరులు పాల్గొని నిర్వాహకుల సంకల్పాన్ని ప్రత్యేకంగా అభినందించారు.


ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ మాట్లాడుతూ.. సమాజంలో ఆహార కల్తీ తీవ్ర ఆందోళనకర స్థాయికి చేరిందని హెచ్చరించారు. కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఆహారాన్ని అందించే విధానాలు ప్రజారోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే తరాలకు మనం ఇచ్చే నిజమైన ఆస్తి స్వచ్ఛమైన గాలి, నీరు, కల్తీలేని నాణ్యమైన ఆహారమేనని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా నేటి జెన్‌జీ (Gen-Z) యువత తమ ఆహారపు అలవాట్లను మార్చుకుని, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణపై బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. అనారోగ్యం బారినపడ్డాక ఆసుపత్రుల చుట్టూ తిరగడం కంటే, నివారణే ఉత్తమ మార్గమనే సూత్రాన్ని ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో అలవర్చుకోవాలని ఆయన సూచించారు.


ఇదే వేదికపై ఆరోగ్య గ్రామ వ్యవస్థాపకుడు లక్ష్మణ్ పూడి సినీ రంగానికి ఓ అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించారు. ఆరోగ్య స్పృహను ప్రజల్లోకి మరింత వేగంగా తీసుకెళ్లేందుకు సినీ మాధ్యమం ఎంతో ఉపయోగపడుతుందని భావించిన ఆయన.. చిత్ర పరిశ్రమలోని చిన్న నిర్మాతలు, దర్శకులు తమ సినిమా పూజా కార్యక్రమాలు, టీజర్ లేదా ట్రైలర్ లాంచ్‌లు, ప్రెస్‌మీట్‌లను లక్ష్మణ్ ఆరోగ్య గ్రామంలో నిర్వహించుకోవచ్చని ఆహ్వానించారు. ఇందుకోసం ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా వేదికను, అవసరమైన అన్ని సదుపాయాలను సమకూరుస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా అక్కడికి వచ్చే సినీ ప్రముఖులకు, యూనిట్ సభ్యులకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన పౌష్టికాహారాన్ని కూడా ఉచితంగా అందిస్తామని తెలిపారు. దీనివల్ల సినీ పరిశ్రమకు ప్రమోషన్ల ఖర్చు తగ్గడంతో పాటు, సహజ జీవన విధానంపై వినోద రంగం ద్వారా విస్తృత ప్రచారం కల్పించినట్లు అవుతుందని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా ప్రజలకు చేరువయ్యేలా మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

‘ఫౌజీ’ గ్లింప్స్‌పై నేతాజీ మనవడి ఆగ్రహం.. క్షమాపణ చెప్పాలని డిమాండ్

సౌందర్య అంత అందంగా ఉండేది కాబట్టే.. దేవుడు తీసుకెళ్లిపోయాడు: ఆమని

రజనీతో రజనీకే పోటీ.. టాప్‌-3లో ఒకడే కింగ్‌

Updated Date - Oct 26 , 2026 | 09:57 PM