రజనీకాంత్ - కమల్ హాసన్ మల్టీస్టారర్‌కు బ్రేక్.. కారణమిదేనా?

ABN , Publish Date - Oct 26 , 2026 | 08:11 AM

భారతీయ చలన చిత్ర పరిశ్రమలోనే అత్యంత అరుదైన, కనీవినీ ఎరుగని కాంబినేషన్‌గా తెరపైకి రాబోతోన్న ప్రాజెక్ట్ సూపర్‌స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ మల్టీస్టారర్. ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడో వార్త సినీ వార్తల్లో బాగా చక్కర్లు కొడుతోంది.

Kamal Haasan Rajinikanth

భారతీయ చలన చిత్ర పరిశ్రమలోనే అత్యంత అరుదైన, కనీవినీ ఎరుగని కాంబినేషన్‌గా తెరపైకి రాబోతోన్న ప్రాజెక్ట్ సూపర్‌స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth), ఉలగనాయగన్ కమల్ హాసన్ (Kamal Haasan) మల్టీస్టారర్. ‘జైలర్’ (Jailer) సిరీస్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ సారథ్యంలో ఈ భారీ విజువల్ వండర్ రూపుదిద్దుకోనుంది. తొలుత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఈ ఏడాది డిసెంబర్ నుంచే పట్టాలెక్కించాలని మేకర్స్ భావించారు. అయితే, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే డిసెంబర్‌లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లడం అసాధ్యంగా కనిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే 2027 నాటికి వాయిదా పడే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.


ఈ షూటింగ్ ఆలస్యానికి సినీ వర్గాల్లో బలమైన కారణాలే వినిపిస్తున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వివాహం (Anirudh Ravichander Marriage) నవంబర్‌లో జరగనుండటంతో.. నెల్సన్ (Nelson), రజనీకాంత్ ఇద్దరూ ఈ వేడుకల్లోనే నెల మొత్తం బిజీగా గడపనున్నారు. వారి షెడ్యూల్స్ మళ్లీ అందుబాటులోకి వచ్చేసరికి డిసెంబర్ అవుతుంది. మరోవైపు, అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటిస్తూ, కమల్ హాసన్ నిర్మిస్తోన్న ‘ధర్మన్’ మూవీ షూటింగ్ సైతం డిసెంబర్ నాటికి గానీ పూర్తికాదు. వీటన్నింటికీ మించి.. దర్శకుడు నెల్సన్ ఇంకా పూర్తి స్థాయి స్క్రిప్ట్, స్క్రీన్‌ప్లేను లాక్ చేసి ఇద్దరు దిగ్గజాలకు కూర్చోబెట్టి పూర్తి నెరేషన్ ఇవ్వాల్సి ఉంది.


అద్భుతమైన రచయిత, మేధావి అయిన కమల్ హాసన్ కథ, స్క్రీన్‌ప్లేపై తనదైన శైలిలో కీలక సూచనలు ఇచ్చే అవకాశం ఉండగా.. రజనీకాంత్ కూడా తన మార్క్ మార్పులు చేర్పులు సూచిస్తారు. ఆ ఇద్దరి స్టార్‌డమ్, ఇమేజ్‌కు న్యాయం చేస్తూ ఇద్దరినీ మెప్పించేలా స్క్రిప్ట్‌ను ఫైనల్ చేయడం నెల్సన్‌కు పెద్ద టాస్క్. స్క్రిప్ట్ పూర్తయిన తర్వాత ఇతర కీలక పాత్రల కోసం నటీనటులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టులంతా ఇప్పటికే రానున్న మూడు నెలల పాటు ఇతర సినిమాల కమిట్‌మెంట్స్‌తో తీరిక లేకుండా ఉన్నారు. వీటన్నింటి దృష్ట్యా ఏప్రిల్ లేదా మే 2027 నాటికి గానీ ఈ సెన్సేషనల్ మూవీ సెట్స్‌పైకి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. అయితే ఆలస్యమైనా సరే.. ఇద్దరు లెజెండ్స్ స్క్రీన్‌ను పంచుకోనుండటంతో అభిమానులు ఎంత కాలమైనా నిరీక్షించేందుకు సిద్ధంగా ఉన్నారంటే.. అతిశయోక్తి కానే కాదు.

ఇవి కూడా చదవండి:

టాలీవుడ్‌లో ‘జైలర్ 2’ హిస్టరీ.. ఫస్ట్ కోలీవుడ్ ఫిల్మ్‌గా రికార్డ్

ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన విశ్వక్ సేన్.. ఎందుకంటే?

నాని ‘ద ప్యారడైజ్’కు.. మహేష్ తనయుడు ఇచ్చిన రేటింగ్ ఎంతో తెలుసా?

Updated Date - Oct 26 , 2026 | 08:11 AM

Rajinikanth 173: ‘రజనీ-173’  దర్శకుడు క్లారిటీ 

Kamal Haasan : చీకటి శాశ్వతం కాదని గమనించా!

Kamal Haasan : కమల్‌హాసన్ చేతుల మీదుగా కృష్ణ విగ్రహావిష్కరణ

Kamal Haasan : తమ్ముడూ... నిన్ను చూసి గర్విస్తున్నా

Jailer 2: 40 ఏళ్ల తర్వాత.. ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూసిన రజనీ