ఐదేళ్ల తర్వాత మళ్లీ.. రజనీకాంత్ ‘ధర్మన్’లో లేడీ సూపర్‌స్టార్

ABN , Publish Date - Oct 26 , 2026 | 08:57 AM

సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో, ఉలగనాయగన్ కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘ధర్మన్’. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు.

Dharman Movie Update

సూపర్‌స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) ప్రధాన పాత్రలో, ఉలగనాయగన్ కమల్ హాసన్ (Kamal Haasan) నిర్మాణంలో తెరకెక్కుతోన్న మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘ధర్మన్’ (Dharman). ‘ఓ మై కడవులే’, ‘డ్రాగన్’ చిత్రాలతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న అశ్వత్ మారిముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి తాజాగా ఓ అదిరిపోయే అప్‌డేట్ బయటకు వచ్చింది. సౌత్ లేడీ సూపర్‌స్టార్ నయనతార (Nayanthara) ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. ‘ది ఆరా ఈజ్ డబుల్.. వెల్‌కమింగ్ ది వన్ అండ్ ఓన్లీ నయనతార టు ధర్మన్’ అంటూ నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI) అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేస్తూ ఈ విషయాన్ని ధ్రువీకరించింది.


రజనీకాంత్, నయనతార కాంబినేషన్‌కు బాక్సాఫీస్ వద్ద ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. గతంలో వీరిద్దరి కలయికలో ‘చంద్రముఖి’, ‘శివాజీ’ (స్పెషల్ అప్పియరెన్స్), ‘కథానాయకుడు’ (కుసేలన్), ‘దర్బార్’ వంటి చిత్రాలు వచ్చాయి. చివరగా 2021లో వచ్చిన ‘అన్నాత్తే’ (తెలుగులో ‘పెద్దన్న’) తర్వాత దాదాపు ఐదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం వీరిద్దరూ ‘ధర్మన్’ కోసం మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటుండటంతో అభిమానుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి. కథ పరంగా నయనతార పాత్ర అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటుందని సమాచారం. ఇప్పటికే సిమ్రాన్, రాశీ ఖన్నా, శ్రీలీల, యోగిబాబు వంటి భారీ తారాగణం ఈ సినిమాలో నటిస్తుండగా, విలన్ పాత్ర కోసం టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తీసుకున్న విషయం తెలిసిందే.


ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ, ప్రదీప్ ఇ. రాఘవ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలను అన్బరివ్ మాస్టర్స్ డిజైన్ చేస్తున్నారు. ఇప్పటికే పలు కీలక షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, అక్టోబర్ బ్రేక్ తర్వాత నవంబర్ నుంచి మిగిలిన షూటింగ్‌ను శరవేగంగా ముగించనుంది. డిసెంబర్ నాటికి టాకీ పార్ట్ పూర్తి చేసి, 2027 పొంగల్ బరిలో ‘ధర్మన్’ను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రజనీ-కమల్ కాంబో ప్రొడక్షన్‌కు నయనతార రాక తోడవడంతో ‘ధర్మన్’ బాక్సాఫీస్ వద్ద మరింత హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఆమె ఎంట్రీకి సంబంధించిన వార్త టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి:

రజనీకాంత్ - కమల్ హాసన్ మల్టీస్టారర్‌కు బ్రేక్.. కారణమిదేనా?

టాలీవుడ్‌లో ‘జైలర్ 2’ హిస్టరీ.. ఫస్ట్ కోలీవుడ్ ఫిల్మ్‌గా రికార్డ్

ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన విశ్వక్ సేన్.. ఎందుకంటే?

Updated Date - Oct 26 , 2026 | 08:57 AM

Nayanthara : వామ్మో... అంతనా....

Nayanthara : బాధపెట్టాం... క్షమించండి

Nayanthara gets Emotional: 22 యేళ్ళ జర్నీని తలుచుకున్న నయన్

Dharman: తలైవర్ 173 టైటిల్ ఖరారు.. రఫ్పాడించేస్తోన్న ఫస్ట్ లుక్!

Kamal Haasan : తమ్ముడూ... నిన్ను చూసి గర్విస్తున్నా