Krithi Shetty: బేబమ్మని ఇక ఆ దర్శకుడే కాపాడాలి!
ABN , Publish Date - Apr 12 , 2026 | 04:43 PM
‘ఉప్పెన’ హీరోయిన్ కృతిశెట్టి కెరీర్ జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తుంది అనుకుంటున్న తరుణంలో.. కాలం తలకిందులైంది. ఊహించని విధంగా వరుస పరాజయాలు అమ్మడిని పలకరించాయి.
టాలీవుడ్‌లో ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో బేబమ్మ కృతి శెట్టి (Krithi Shetty) ఒకరు. ‘ఉప్పెన’ (Uppena) సినిమాతో కుర్రకారు గుండెల్లో గూడు కట్టుకున్న ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత ‘శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది. ఇక ఈమె కెరీర్ జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తుంది అనుకుంటున్న తరుణంలో.. కాలం తలకిందులైంది. ఊహించని విధంగా వరుస పరాజయాలు అమ్మడిని పలకరించాయి. తాజాగా విడుదలైన ‘LIK’ సినిమాతో కలిపి.. ఇప్పటి వరకు వరుసగా 8 ఫ్లాపులు కృతి ఖాతాలో చేరాయి.
నిజానికి కృతి శెట్టికి టాలెంట్ లేదని కాదు.. గ్లామర్ లేదని అసలే కాదు. కానీ కథల ఎంపికలో ఎక్కడో పొరపాటు జరుగుతోంది. ఒకప్పుడు టాలీవుడ్ గోల్డెన్ లెగ్ అని పిలిపించుకున్న ఈ అమ్మడు, వరుస ఫ్లాపులతో తీవ్ర ఇబ్బందుల్లో పడింది. దాదాపు ఎనిమిది సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో, ఇక కృతి కెరీర్ క్లోజ్ అయిపోయిందనే కామెంట్స్ కూడా వినిపించాయి. సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే గౌరవం ఉంటుంది. వరుస ఫ్లాపుల్లో ఉన్న హీరోయిన్‌కు అవకాశాలు రావడం చాలా కష్టం. ఇలాంటి క్రమంలోనే కృతికి ఒక క్రేజీ ప్రాజెక్టులో ఛాన్స్ దక్కింది. ప్రస్తుతం కృతి శెట్టి ఆశలన్నీ దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) పైనే ఉన్నాయి. టాలీవుడ్ హిట్ మెషీన్‌గా పేరున్న అనిల్ రావిపూడి, తన సినిమాల్లో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్‌ను చాలా కొత్తగా, ఫన్నీగా ఉండేలా ప్లాన్ చేస్తుంటారు. వచ్చే సంక్రాంతి రేసులో ఉన్న అనిల్ రావిపూడి మూవీకి సంబంధించి ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే.
మల్టీస్టారర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో కృతికి ఒక మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కిందని సమాచారం. అటు యాక్షన్, ఇటు ఫన్ రెండింటినీ బ్యాలెన్స్ చేయడంలో అనిల్ రావిపూడి దిట్ట. ఈ సినిమా కనుక హిట్ అయితే కృతి శెట్టి కెరీర్ మళ్ళీ గాడిలో పడటం ఖాయం. కాబట్టి, కృతిని అనిల్ రావిపూడే కాపాడాలి. ఈ సినిమా కేవలం కృతి శెట్టికే కాదు, నందమూరి కళ్యాణ్ రామ్‌కు కూడా చాలా కీలకం. ‘బింబిసార’ తర్వాత ఆయనకు సరైన హిట్ పడలేదు. ఇక విక్టరీ వెంకటేష్ గురించి మనకు తెలిసిందే.. అనిల్ రావిపూడితో ఆయనకు ఉన్న బాండింగ్ సూపర్ హిట్ ట్రాక్ రికార్డును కలిగి ఉంది. వీరిద్దరి కాంబినేషన్ అంటేనే మినిమం గ్యారంటీ ఎంటర్‌టైన్‌మెంట్. ఈ పాజిటివ్ వైబ్స్ కృతి శెట్టికి బాగా ప్లస్ అయ్యేలా కనిపిస్తున్నాయి. మరి వరుసగా 8 ఫ్లాపులు చూసిన బేబమ్మకు, అనిల్ రావిపూడి ఎంతవరకు బ్రేక్ ఇస్తాడో చూడాలి.
ఇవి కూడా చదవండి:
ఎం.ఎస్. రాజు రూటు మార్చారు.. ఈసారి నో ఫీలింగ్స్!
Chiranjeevi: చిరంజీవికి తప్పని వెయిటింగ్.. ఈ అడ్డంకులేంటి?
Venu Udugula: మంగ్లీ ఘటనతో నాకు ఎలాంటి సంబంధం లేదు
UBS OTT: ఉస్తాద్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. స్ట్రీమింగ్ వివరాలివే!
Jailer 2: షారుఖ్ ప్లేస్‌లో పవన్ కళ్యాణ్.. బాబోయ్, ఈ వార్త నిజమైతేనా?