కృష్ణాష్టమి కానుకగా 'కృష్ణంభజే' ఫస్ట్ లుక్ లాంచ్
ABN, Publish Date - Sep 04 , 2026 | 02:46 PM
కృష్ణాష్టమి సందర్భంగా 'కృష్ణంభజే' చిత్రం నుంచి ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో సీనియర్ నటుడు బ్రహ్మాజీ మార్కండేయుడిగా నటిస్తున్నారు.
జయశ్రీ మీడియా సమర్పణలో తెరకెక్కుతున్న భక్తిరస చిత్రం ‘కృష్ణంభజే’. కలాల్ శ్రీనివాస్ నిర్మాణంలో నాగరాజ్ కొట్టే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ సీనియర్ నటుడు బ్రహ్మాజీ మార్కండేయ పాత్రను పోషిస్తున్నారు. హీరోగా ప్రదీష్, హీరోయిన్‌గా వంగమయి పటేల్ నటిస్తున్నారు. కృష్ణాష్టమి కానుకగా బ్రహ్మాజీ 'కృష్ణంభజే' ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియాలో లాంచ్ చేశారు.
పోస్టర్‌లోని బ్రహ్మాజీ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. బ్రహ్మాజీ మార్కండేయుడి గెటప్‌లో సంప్రదాయ ఆధ్యాత్మిక రూపంలో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. కాషాయ వస్త్రధారణ, రుద్రాక్ష మాలలు, నుదుటిపై విభూతి, చేతిలో కమండలంతో లుక్ ప్రత్యేకంగా ఉంది. పౌరాణిక, భక్తిరస అంశాలను మేళవిస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగరాజ్ కొట్టే రచనతో పాటు దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కథకు అనుగుణంగా ప్రత్యేకమైన పాత్రలు, ఆసక్తికరమైన సన్నివేశాలతో సినిమాను రూపొందిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
ఈ చిత్రంలో మురళీ గౌడ్, రచ్చ రవి, అభయ్ బెతిగంటి, గౌతమ్ రాజు, దయానంద్ రెడ్డి, యాదమ్మ రాజు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన సంభాషణలను రచ్చ రవి అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో ‘కృష్ణంభజే’కు సంబంధించిన మరిన్ని వివరాలు, టీజర్, ఇతర ప్రచార చిత్రాలను త్వరలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
ఇవి కూడా చదవండి:
Rambha Oorvasi Menaka: రంభ ఊర్వశి మేనక మూవీ రివ్యూ
సినిమా రివ్యూ: ధర్మస్థల నియోజకవర్గం
సినిమా రివ్యూ: బెత్లెహామ్ కుటుంబ యూనిట్
Romanchakam Review: సందీప్ రెడ్డి వంగా ‘రోమాంచకం’ రివ్యూ