శ్రీధర్ గాదె కొత్త సినిమా 'కొరివి'.. టైటిల్ గ్లింప్స్ విడుదల
ABN , Publish Date - Oct 31 , 2026 | 05:44 PM
'ఎస్ఆర్ కళ్యాణమండపం' ఫేమ్ దర్శకుడు శ్రీధర్ గాదె తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం 'కొరివి' టైటిల్ను మేకర్స్ ప్రకటించారు. ఈశ్వర్ రాచిరాజు హీరోగా నటిస్తున్న ఈ హారర్ మూవీ టైటిల్ గ్లింప్స్ విడుదలైంది.
'ఎస్ఆర్ కళ్యాణమండపం' చిత్రంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించి... దర్శకుడిగా ప్రతిభ చాటుకున్న డైరెక్టర్ శ్రీధర్ గాదె రూపొందిస్తున్న కొత్త చిత్రానికి 'కొరివి' టైటిల్ అనౌన్స్ చేశారు. శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్ పై ఆది సాయి కుమార్తో 'చుట్టాలబ్బాయ్' వంటి ఫ్యామిలీ మూవీ, ఆనంద్ దేవరకొండతో 'హైవే' వంటి యూనిక్ థ్రిల్లర్ మూవీని నిర్మించిన ప్రొడ్యూసర్ వెంకట్ తలారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'కొరివి' చిత్రంలో 'కమిటీ కుర్రోళ్ళు' ఫేమ్ ఈశ్వర్ రాచిరాజు హీరోగా నటిస్తుండగా, నందు మురళీధర్, లిఖిత హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పూజిత పొన్నాడ, సింధు కాసారం ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.
శనివారం దర్శకుడు శ్రీధర్ గాదె బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఈ చిత్రానికి 'కొరివి' అనే టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. మాయా నది ప్రాంతంలో ఉన్న నిధికి కాపు కాసే ఓ కొరివి ఆ దెయ్యం కథ ఇది. ఈ టైటిల్ గ్లింప్స్ లో ఇంట్రెస్టింగ్ మేకింగ్ విజువల్స్ చూపించడం విశేషం. టైటిల్ అనౌన్స్ మెంట్, ఈ గ్లింప్స్ తో 'కొరివి' మూవీ టీమ్ డైరెక్టర్ శ్రీధర్ గాదెకు బర్త్ డే విషెస్ తెలియజేసింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే యూనిక్ హారర్ మూవీగా 'కొరివి' తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. ‘ఓ నా సిద్ధయ్య’ సాంగ్ లాంచ్
RC17 హీరోయిన్ SA కాదు, AP కాదు, PM కాదు.. అచ్చ తెలుగమ్మాయ్
రూ.200 కోట్ల దోపిడీ కేసులో ట్విస్ట్.. నోరా ఫతేహీకి ఢిల్లీ హైకోర్టు సమన్లు