Chennai Love Story: సోనీ పిక్చర్స్ చేతికి డిజిటల్, శాటిలైట్ హక్కులు
ABN, Publish Date - Jul 27 , 2026 | 05:29 PM
కిరణ్ అబ్బవరం తాజా చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' డిజిటల్, శాటిలైట్ హక్కుల్ని సోనీ లివ్ సంస్థ కైవసం చేసుకుంది. థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత ఈ సినిమా అందులో ప్రసారం కానుంది.
బాక్సాఫీస్ బరిలో తొలి వారాంతంలో మంచి ఓపెనింగ్స్ సాధించింది 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమౌతున్న ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులను ప్రముఖ సంస్థ సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా కైవసం చేసుకుంది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత సోనీ లివ్ (Sony LIV) లో ఎక్స్‌క్లూజివ్‌గా ఈ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్ కానుంది.
జూలై 24న థియేటర్లలో విడుదలైన 'చెన్నై లవ్ స్టోరీ' ఈ సీజన్‌లో భారీ బాక్సాఫీస్ హిట్‌లలో ఒకటిగా నిలిచి, అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రాబట్టుకుంటోంది. హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ ఫ్రెష్ పెయిరింగ్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేస్తోంది. వారిద్దరి సహజమైన నటన, అద్భుతమైన కెమిస్ట్రీకి ప్రేక్షకుల నుంచి చక్కని ఆదరణ లభిస్తోంది. తొలిప్రేమలోని ఉత్సాహం, సంక్లిష్టతలు, ఎత్తుపల్లాలు, భావోద్వేగాల మధ్య ఇద్దరు యువతీయువకుల ప్రయాణమే ఈ చిత్ర కథాంశం. వాస్తవిక అనుభవాలు, హృదయాన్ని హత్తుకునే ఎమోషన్స్‌ను జోడించి తొలిప్రేమలోని మాధుర్యాన్ని 'చెన్నై లవ్ స్టోరీ' సినిమాతో వెండితెరపై అందంగా, ఆకట్టుకునేలా చూపించారు.
ఈ డిజిటల్, శాటిలైట్ భాగస్వామ్యం గురించి నిర్మాత ఎస్‌కేఎన్ (SKN) మాట్లాడుతూ, 'థియేటర్లలో 'చెన్నై లవ్ స్టోరీ'కి ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ చూస్తుంటే ఆనందంగా ఉంది. ఈ సినిమాకు, అందులోని పాత్రలకు ప్రేక్షకులు ఇంతలా కనెక్ట్ కావడం మాకు ఎంతో సంతృప్తినిచ్చింది. ఈ చిత్రాన్ని మరింత మంది ప్రేక్షకులకు చేరువ చేసేందుకు సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియాతో డిజిటల్, శాటిలైట్ ప్రీమియర్ల కోసం భాగస్వామ్యం కుదుర్చుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. దక్షిణాది నుంచి అద్భుతమైన కథలను తీసుకురావడంలో సోనీ లివ్ బలమైన గుర్తింపు తెచ్చుకుంది. వారి కంటెంట్ జాబితాలో మా 'చెన్నై లవ్ స్టోరీ' కూడా భాగం కావడం ఎంతో ఆనందంగా ఉంది' అని అన్నారు.
ఈ సినిమాకు సాయి రాజేష్ నీలం కథ అందించగా, రవి నంబూరి దర్శకత్వం వహించారు. అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్లపై ఎస్‌కేఎన్, సాయి రాజేష్ నిర్మాతలుగా వ్యవహరించారు. అతిత్వరలో ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ ప్రీమియర్ తేదీలకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించనుంది.
ఇవి కూడా చదవండి:
మరీ ఈ రేంజ్‌లోనా.. ఆదర్శకుటుంబం వెంకీ పాత్ర రివీల్
‘టాక్సిక్’ వన్ మంత్ కౌంట్‌డౌన్ పోస్టర్.. అరాచకం
200 మిలియన్ వ్యూస్.. ‘ఆయా షేర్’ ఆల్ టైమ్ రికార్డ్