మరీ ఈ రేంజ్‌లోనా.. ఆదర్శకుటుంబం వెంకీ పాత్ర రివీల్

ABN , Publish Date - Jul 27 , 2026 | 01:58 PM

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపుదిద్దుకుంటోన్న కుటుంబ కథా చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 (AK47)’. ఈ మూవీ నుంచి వెంకీ పాత్రను రివీల్ చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు.

Aadarsha Kutumbam AK 47 Update

విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinvias) కలయికలో రూపుదిద్దుకుంటోన్న కుటుంబ కథా చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 (AK47)’ (Aadarsha Kutumbam AK 47). అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకానున్న ఈ మూవీ ప్రచార కార్యక్రమాలను మేకర్స్ అధికారికంగా ప్రారంభించారు. అందులో భాగంగా చిత్రంలోని ప్రధాన పాత్రలను ఒక్కొక్కటిగా పరిచయం చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. తొలి పాత్రగా విక్టరీ వెంకటేష్ పోషిస్తున్న పాత్రను మేకర్స్ రివీల్ చేశారు. ఇందులో వెంకీమామ ‘చిట్టిబాబు’ (Venkatesh as Chittibabu)గా అలరించబోతున్నారు. వెంకీ పాత్రను పరిచయం చేసిన మేకర్స్ త్వరలోనే శ్రీనిధి శెట్టి, యువినా పార్థవి, రాజా ప్రజ్వల్ పాత్రలను పరిచయం చేయనున్నారు. ఈ నలుగురి పాత్రలు ఈ ఆత్మీయ కుటుంబ కథకు హృదయంగా నిలవనున్నాయి.


వెంకటేష్ పాత్రను పరిచయం చేస్తున్న విడుదల చేసిన వీడియోను గమనిస్తే.. కుటుంబాన్ని ప్రేమతో, ఆప్యాయతతో, బాధ్యతతో ఒకే తాటిపై నడిపించే ఫ్యామిలీ పెద్దగా ఆయన పాత్ర ఇందులో ఉంటుందనే విషయం తెలుస్తోంది. ఈ వీడియోలో వెంకటేష్‌తో పాటు శ్రీనిధి శెట్టి, నారా రోహిత్ కనిపిస్తూ.. నవ్వులు, భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాలతో నిండిన చిత్ర ప్రపంచాన్ని అందంగా పరిచయం చేశారు. ముఖ్యంగా త్రివిక్రమ్ మార్క్ పంచ్‌లు స్పష్టంగా కనిపించడమే కాకుండా.. వెంకీ పాత్ర ‘నువ్వు నాకు నచ్చావ్’కు కంటిన్యూటీ అన్నట్లుగా ఉండటం విశేషం.


సహజమైన నటన, అద్భుతమైన కామెడీ టైమింగ్, కుటుంబ కథా చిత్రాల్లో తనదైన ముద్ర వేసిన వెంకటేష్ మరోసారి అన్ని వయసుల ప్రేక్షకులను అలరించే పాత్రతో రాబోతున్నట్లుగా ఈ చిట్టిబాబు పాత్ర తెలియజేస్తోంది. వెంకీ కెరీర్‌లో మరో చిరస్మరణీయమైన పాత్రగా ‘చిట్టిబాబు’ నిలిచేలా కనిపిస్తోంది. ఆనందం, అనుబంధాలు, కుటుంబ విలువలకు ప్రతిరూపంగా ఈ పాత్ర ఉండబోతోంది. తొలి పాత్ర పరిచయంతోనే చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక వరుసగా రానున్న ఇతర పాత్రల పరిచయాలు కూడా ‘ఆదర్శ కుటుంబం’ ప్రపంచాన్ని మరింత ఆసక్తికరంగా ప్రేక్షకులకు చేరువ చేయనున్నాయని భావించవచ్చు. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

‘టాక్సిక్’ వన్ మంత్ కౌంట్‌డౌన్ పోస్టర్.. అరాచకం

200 మిలియన్ వ్యూస్‌.. ‘ఆయా షేర్’ ఆల్ టైమ్ రికార్డ్

మహేష్ బాబు తర్వాత మళ్లీ జై కృష్ణలోనే చూశా: వీకే నరేష్

Updated Date - Jul 27 , 2026 | 01:58 PM