సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

The Paradise: కాయదుకు కలిసి రావట్టేదు!

ABN, Publish Date - Sep 24 , 2026 | 03:07 PM

నటి కాయదు లోహర్ కు తెలుగులో మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. 'అల్లూరి', 'ఫంకీ' తర్వాత ఆమె నటించిన మూడో చిత్రం 'ది ప్యారడైజ్‌' సైతం నెగెటివ్‌ టాక్‌ నే తెచ్చుకుంది.

Kayadu Lohar

కొందరు అందాల భామలకు అవకాశాలు అయితే వస్తుంటాయి కానీ విజయాలు మాత్రం అంత తేలికగా దక్కవు. ప్రస్తుతం కాయదు లోహార్‌ పరిస్థితి అలానే ఉంది. అస్సాంలో పుట్టి పూణేలో పెరిగింది కాయదు లోహార్‌. 2021లో కన్నడ సినిమా 'ముగిల్‌ పేట'తో శాండిల్‌వుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. అందం చందం ఉన్న కాయదు లోహార్‌ కు ఆ తర్వాత సంవత్సరమే మలయాళం, తెలుగు సినిమాలలో నటించే ఛాన్స్ దక్కింది. శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన 'అల్లూరి'లో కాయదు హీరోయిన్‌గా నటించింది. అష్టకష్టాలు పడి కాస్తంత ఆలస్యంగా జనం ముందుకొచ్చిన ఆ సినిమా పరాజయం పాలైంది. అయినా కాయదు కెరీర్‌ కు ఫుల్ స్టాప్‌ పడలేదు. ఆ తర్వాత కూడా ఆమెకు తెలుగులో ఛాన్స్ వచ్చింది. అదే 'ఫంకీ' సినిమా.


విశ్వక్‌ సేన్‌ హీరోగా అనుదీప్‌ కె. వి. దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'ఫంకీ' సినిమాలో కాయదు సినిమా ప్రొడ్యూసర్‌ కూతురు పాత్రను పోషించింది. తండ్రి నుంచి పగ్గాలు తన చేతుల్లోకి తీసుకుని, సినిమాను ఆమే నిర్మిస్తుంది. అయితే సినిమా మీద తీసిన ఆ సినిమా కూడా బాక్సాఫీస్ బరిలో బోల్తా కొట్టింది. అలా తెలుగులో రెండు పరాజయాలను బ్యాక్‌ టు బ్యాక్‌ అందుకున్న కాయదు ముచ్చటగా మూడో సినిమాగా 'ది ప్యారడైజ్‌'కు సైన్ చేసింది. ఇందులో ఆమె పోషించింది కూడా సినిమా రంగానికి చెందిన పాత్ర కావడం విశేషం. సినిమా హీరోయిన్ కావాలని చెన్నయ్ వెళ్ళి, అవకాశాలు రాక వెనక్కి వచ్చేసి, అప్పులు చేసి అవమానంతో చనిపోయిన తండ్రికి గౌరవం కల్పించడం కోసం బి గ్రేడ్‌ సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తుందామె. చిత్రం ఏమంటే... ఆ సినిమాలను ఆమె తల్లే వీడియో కెమెరాతో కూతురు అంగాంగ ప్రదర్శనలను చిత్రీకరిస్తుంది. ముఖం చూపించకుండా సినిమాల్లో చేసేసి, తండ్రి చేసిన అప్పులు తీర్చేసి... తన బలహీనత అయిన సిగిరెట్‌ తాగడాన్ని యాక్సెప్ట్ చేసే హీరోతో సదరు పాత్ర ప్రేమలో పడిపోతుంది. మరి దర్శకుడు షూటింగ్‌ కు ముందు కాయదుకు కథ చెప్పాడో లేదో... లేకపోతే నాని సినిమా అని కథ వినకుండానే కాయదు అంగీకరించిందేమో తెలియదు. మొత్తానికి బి గ్రేడ్‌ హీరోయిన్‌ గా నటించిన కయాదును ఆ పాత్రలో జనం అసలు ఊహించుకోలేకపోతున్నారు. సహజంగా కొన్ని సినిమాలు పరాజయం పాలైనా... హీరోహీరోయిన్లకు మంచి గుర్తింపు వస్తుంది. కానీ ఇందులో కాయదుకు గుర్తింపు కాదు కదా... కనీసం బాగా చేసిందనే పేరు కూడా రావడం కష్టమే అంటున్నారు సినీ జనం.


తెలుగులో వరుసగా మూడు పరాజయాలు పొందిన కాయదు కెరీర్‌ కు ఫుల్ స్టాప్ పడుతుందనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. చిత్రం ఏమంటే... కాయదు కెరీర్‌లోనే ఈ యేడాది అత్యధిక చిత్రాలు విడుదలయ్యాయి. తెలుగు సినిమాలు 'ఫంకీ, ద ప్యారడైజ్‌' తో పాటు ఆమె ఈ యేడాది నటించిన పరభాషా చిత్రాలు 'పళ్ళిచట్టంబి, హృదయం మురళీ, ఐయామ్‌ గేమ్‌, ఇమ్మోర్టల్' కూడా తెలుగులో డబ్ కావడం విశేషం. అయితే ఇందులో ఒక్క 'హృదయం మురళీ' తప్పితే మిగిలినవి ఏవీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి.

ఇవి కూడా చదవండి:

The Paradise Review : ది ప్యారడైజ్‌ మూవీ రివ్యూ

‘జార్జ్ క్రిష్’ బిగ్ అప్‌డేట్.. హీరోయిన్‌గా మిస్ ఇండియా ఫిక్స్

రామ్ చరణ్-సుకుమార్ RC17పై క్రేజీ అప్‌డేట్

హీరోయిన్ కాదు.. రాకాలో రష్మికకు భారీ ట్విస్ట్?

Updated Date - Sep 24 , 2026 | 03:10 PM