సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘కర’ అనే టైటిల్‌ పెట్టడానికి కారణమిదే - నిర్మాత

ABN, Publish Date - Apr 29 , 2026 | 11:24 PM

ధనుష్, మమితా బైజు హీరోహీరోయిన్లుగా కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఐషరి కె. గణేష్ నిర్మించిన చిత్రం ‘కర’. విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.

Kara Movie Telugu Producer CH Satish Kumar

ధనుష్, మమితా బైజు హీరోహీరోయిన్లుగా కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఐషరి కె. గణేష్ నిర్మించిన చిత్రం ‘కర’. విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సీహెచ్. సతీష్ కుమార్ మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ..

‘‘మాది విశాఖపట్నం.. చిన్న సినిమాలను కొంటూ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఓ మూవీని కూడా నిర్మించాను. ‘అర్జున్ రెడ్డి’, ‘కబాలి’, ‘సింగం 3’, ‘సలార్’, ‘కాంతార చాప్టర్ 1’ వంటి సినిమాలను ఉత్తరాంధ్రలో డిస్ట్రిబ్యూషన్ చేశాను. ఇంతకు ముందు ధనుష్ చిత్ర ‘ధర్మయోగి’ని తెలుగులో రిలీజ్ చేశాను. ప్రొడక్షన్‌లోనూ మంచి సినిమాల్ని చేయాలని అనుకుంటున్నాను. ఈ ‘కర’ మూవీ కోసం నా స్నేహితుడు రాజేష్ సపోర్ట్ తీసుకున్నాను. ధనుష్‌కు మంచి మార్కెట్ ఉంది. ఇందులో మంచి కంటెంట్ ఉంది. ఈ మూవీ గొప్ప విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది. అందుకే ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నాను. ధనుష్ ‘కుబేర’ మంచి విజయం సాధించింది. ‘ఇడ్లీకొట్టు’ని తెలుగులో సరిగ్గా ప్రమోట్ చేసి ఉండాల్సింది. ‘రాయన్’ తెలుగు వారికి రీచ్ అయింది. ఈ ‘కర’ మూవీని నా శక్తి మేరకు తెలుగు ప్రేక్షకుల వద్దకు తీసుకు వెళ్తాను.


ధనుష్ సినిమా అంటే చాలా పోటీ ఉంటుంది. కానీ నేను పర్సనల్‌గా కేర్ తీసుకుని నిర్మాత గణేష్‌ను అప్రోచ్ అయ్యాను. నా ప్రయత్నం చూసి ఈ చిత్రాన్ని నాకు ఇచ్చారు. 80 శాతం బిజినెస్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. ఓ సాధారణ మనిషికి ఎదురయ్యే సమస్యల్ని చాలా స్ట్రాంగ్ కంటెంట్, ఎమోషనల్ కంటెంట్‌తో ఈ సినిమా రాబోతోంది. తెలుగు వర్షెన్‌ను నేను ఇంకా చూడలేదు. మ్యాగ్జిమం ఎవ్వరూ కూడా సినిమాని అలా ముందే చూపించరు. నైజాంలో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలా ఒక్కో ఏరియాలో ఒక్కొక్కరికి ఇచ్చాం. నేను ఉత్తరాంధ్ర ఏరియాకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. దాదాపు 400కు పైగా స్క్రీన్లలో సినిమాను రిలీజ్ చేస్తున్నాం. హిందీ వర్షెన్‌తో కలిపితే 600కి పైగా స్క్రీన్లలో వచ్చే అవకాశం ఉంది.

కరస్వామి అనే వ్యక్తి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అందుకే తెలుగులో ‘కర’ అనే టైటిల్‌ను పెట్టారు. ‘పోరు తొళిల్’ నాకు ఎంతో ఇష్టమైన సినిమా. విఘ్నేశ్ మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన మీద నాకు చాలా నమ్మకం ఉంది. ‘కర’లో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్ ఎన్నో ఉన్నాయి. తప్పకుండా తెలుగు ప్రేక్షకులను ఈ సినిమా అలరిస్తుంది’’ అని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

కయాదు లోహర్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

మంగ్లీపై అసత్య ప్రచారం.. అసభ్యకర పోస్టులు చేస్తున్నారు

Theater Movies: ఈ వారం.. థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతున్న‌ సినిమాలు

చందమామకు సెకండ్ ఇన్నింగ్స్.. సెట్ అవుతుందా

Updated Date - Apr 29 , 2026 | 11:24 PM