యోగిబాబు ‘సింగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్టోబర్ 30న థియేటర్లలోకి!
ABN , Publish Date - Oct 25 , 2026 | 07:15 AM
యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన ‘సింగారం’ సినిమా అక్టోబర్ 30న విడుదల కానుంది.
రాక్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో ప్రముఖ హాస్య నటుడు యోగిబాబు (Yogi Babu) సింగారం (Singaram) గా కనిపించనున్నారు. కేవీ కదిరవేలు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏఎస్ రమణ బాలాజీ, పద్మావతి గాంధీ సంయుక్తంగా నిర్మించారు. శ్యాం సీఎస్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన చిత్ర ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ఈనెల 30న చిత్రం విడుదలకానున్న నేపథ్యంలో ఇటీవల చెన్నైలో ఆడియో రిలీజ్ వేడుక నిర్వహించారు. కోలీవుడ్ దర్శకుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్వీ ఉదయకుమార్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందాన్ని అభినందించారు.
ఈ సందర్భంగా దర్శకుడు కదిరవేలు మాట్లాడుతూ.. 'సంచార జాతుల చరిత్ర, నేపథ్యాన్ని అర్థం చేసుకోవడానికి విస్తృత పరిశోధన చేసి ఈ చిత్రాన్ని నిర్మించా. సమాజంలో అసమానతలు, అధికారంలో ఉన్న వారి పట్ల గౌరవం, ఇతరులను నిర్లక్ష్యం చేయడం వంటి సమస్యలను ప్రస్తావించాం. సంచార జాతుల చరిత్రతో పాటు రాజకీయ అంశాలు చేర్చా. సామాజిక సమస్యలతో పాటు కుటుంబంతో కలిసి ఆస్వాదించగల సినిమాగా రూపొందించామని దీనికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలి' అని కోరారు.
చిత్ర హీరో యోగిబాబు మాట్లాడుతూ.. 'ఈ సిని మాలో నటించే అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు కదిరవేలు, నిర్మాతలు, ఇతరులకు ధన్యవాదాలు. దివంగత నటులు మనోబాల, మారిముత్తును ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నా. నాకు ఎల్లవేళలా మనోబాల అండగా నిలిచారు. 30న థియేటర్లలో విడుదలవుతుంది. ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరుతున్నా' అని పేర్కొన్నారు.