Sai Durga Tej: ఈసారి విభిన్న కథాంశంతో..

ABN , Publish Date - Apr 29 , 2024 | 09:46 AM

గతేడాది ‘విరూపాక్ష’(Virupaaksha), ‘బ్రో’ (Bro)సినిమాలతో సూపర్‌హిట్స్‌ అందుకున్నారు మెగా మేనల్లుడు సాయిదుర్గా తేజ్‌ ఆ సక్సెస్‌ తర్వాత ఆయన్నుంచి మరో అప్‌డేట్‌ రాలేదు.

Sai Durga Tej:  ఈసారి విభిన్న కథాంశంతో..

గతేడాది ‘విరూపాక్ష’(Virupaaksha), ‘బ్రో’ (Bro)సినిమాలతో సూపర్‌హిట్స్‌ అందుకున్నారు మెగా మేనల్లుడు సాయిదుర్గా తేజ్‌ (Sai durga tej). ఆ సక్సెస్‌ తర్వాత ఆయన్నుంచి మరో అప్‌డేట్‌ రాలేదు. మధ్యలో
ఈసారి విభిన్న కథాంశంతో.. నంది దర్శకత్వంలో ఓ చిత్రం అనుకున్నప్పటికీ అది పట్టాలెక్కలేదు. అయితే ఇప్పుడు తేజ్‌ తదుపరి సినిమాపై స్పష్టత వచ్చినట్లు సమాచారం. నూతన దర్శకుడు రాకేష్‌ చెప్పిన కథకు తేజ్‌ పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. 1940ల నేపథ్యంలో సాగే ఓ ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రూపొందనుందని.. ఇందులో తేజ్‌ గతంలో ఎప్పుడు  చేయని భిన్నమైన పాత్ర పోషిస్తున్నాడని సన్నిహితుల నుంచి సమాచారం.

Sai-tej.jpg

ఈ ఏడాది సంక్రాంతి బరిలో విడుదలై భారీ విజయం సాధించడమే కాకుండా రాసుల వర్షం కురిపించిన ‘హను-మాన్‌’ చిత్ర నిర్మాత నిరంజన్‌రెడ్డి ఈ సినిమాను నిర్మించనున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం జులై నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్లే అవకాశం ఉందని తెలిసింది. ఇందులో హీరోయిన్, సాంకేతిక నిపుణులు ఎవరనేది తెలియాల్సి ఉంది. 

Samantha: ఎట్టకేలకు  అభిమానులకు  బంగారం లాంటి అప్‌డేట్‌!

Read More: Tollywood, Cinema News

Updated Date - Apr 29 , 2024 | 09:57 AM