సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

క్రేజీ అప్‌డేట్.. ‘కల్కి 2’కి లింక్ చేస్తూ రెండు వెబ్ సిరీస్‌లు!

ABN, Publish Date - Jun 25 , 2026 | 10:31 PM

దర్శకుడు నాగ్ అశ్విన్ విజువల్ వండర్ ‘కల్కి 2898 AD’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు అందరి కళ్ళు దీని సీక్వెల్ ‘కల్కి పార్ట్ 2’ పైనే ఉన్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు.

Nag Ashwin Kalki 2898 AD Part 2 Update

దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) విజువల్ వండర్ ‘కల్కి 2898 AD’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు అందరి కళ్ళు దీని సీక్వెల్ ‘కల్కి పార్ట్ 2’ పైనే ఉన్నాయి. అయితే ఈ లోపే ప్రేక్షకులకు, అభిమానులకు సరికొత్త థ్రిల్ ఇవ్వడానికి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఒక మైండ్ బ్లోయింగ్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. కల్కి సినిమాటిక్ యూనివర్స్ (Kalki Cinematic Universe)ను మరింత విస్తరిస్తూ.. ‘కల్కి 2898 AD’ ప్రపంచం నేపథ్యంలో రెండు భారీ వెబ్ సిరీస్‌లను ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.


ఈ రెండు వెబ్ సిరీస్‌లలో మొదటిది.. పార్ట్ 1 లో క్యామియో రోల్‌లో మెరిసిన స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) క్యారెక్టర్ బ్యాక్‌స్టోరీ ఆధారంగా సాగనుందని తెలుస్తోంది. ఇక రెండవ సిరీస్.. కథలో అత్యంత కీలకమైన సుమతి పాత్రకు సంబంధించిన గత విశేషాల చుట్టూ తిరగనుంది. సీక్వెల్‌లో సుమతి పాత్రలో సాయి పల్లవి (Sai Pallavi) నటించబోతుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సిరీస్‌పై మరింత ఆసక్తి నెలకొంది. ఈ రెండు వెబ్ సిరీస్‌లతో ఈ రెండు పాత్రలను ప్రేక్షకులకు మరింత దగ్గర చేయాలనేది నాగ్ అశ్విన్ ప్లాన్ అని తెలుస్తోంది. దీపికా ప్లేస్‌లో సాయి పల్లవి ప్రేక్షకులకు అలవాటు కావాలంటే ఇది అవసరం అని యూనిట్ భావిస్తోందట. ఈ రెండు సిరీస్‌లు ఒక్కొక్కటి దాదాపు ఒక గంట రన్‌టైమ్‌తో ఉండబోతున్నాయని, ఇవి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘సోనీ లివ్’ (SonyLIV) లో స్ట్రీమింగ్ కానున్నాయనేది టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న టాక్.


నాగ్ అశ్విన్ డిజైన్ చేసిన ఈ వెబ్ సిరీస్‌లు కేవలం వినోదం కోసమే కాకుండా.. ‘కల్కి పార్ట్ 1’ క్లైమాక్స్‌కు నేరుగా కనెక్ట్ అయ్యేలా ఉంటాయట. ముఖ్యంగా సుమతి క్యారెక్టర్ ఆర్క్.. ‘కల్కి పార్ట్ 2’ కథలోకి ప్రేక్షకులను తీసుకువెళ్లడానికి ఒక బలమైన లీడ్‌లా పని చేయబోతోందని సమాచారం. మొత్తంగా చూస్తే.. థియేటర్లలో పార్ట్ 2 రాకముందే ఓటీటీలో రాబోతున్న ఈ కంటెంట్ కల్కి ప్రపంచాన్ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్లడం ఖాయమని అనిపిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందనేది తాజా సమాచారం.

ఇవి కూడా చదవండి:

ఖుష్బూ సుందర్ కుమార్తె పెళ్లిలో చిరు, నాగ్, వెంకీ సందడి!

ఇది ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి దిగ్గజాలు జన్మించిన నేల- బాలయ్య

నిన్న రిజిస్టర్ మ్యారేజ్.. నేడు సంప్రదాయం ప్రకారం ఫైమా పెళ్లి

Updated Date - Jun 25 , 2026 | 10:32 PM