ఖుష్బూ సుందర్ కుమార్తె పెళ్లిలో చిరు, నాగ్, వెంకీ సందడి!

ABN , Publish Date - Jun 25 , 2026 | 09:22 PM

కోలీవుడ్ స్టార్ కపుల్ ఖుష్బూ, సుందర్‌ల పెద్ద కుమార్తె అవంతిక పెళ్లి గోవాలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున సందడి చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Khushbu Sundar daughter Marriage Event

కోలీవుడ్ స్టార్ కపుల్ ఖుష్బూ (Khushbu Sundar), సుందర్‌ (Director Sundar)ల పెద్ద కుమార్తె అవంతిక పెళ్లి గోవాలో అంగరంగ వైభవంగా జరిగింది. గోవాలోని ఓ లగ్జరీ రిసార్ట్‌లో జరుగుతోన్న ఈ పెళ్లి‌కి సెలబ్రిటీలెందరో హాజరయ్యారు. చెన్నైకి చెందిన శ్రవణ్ శ్రీనివాసన్‌ అనే యువకుడిని, అవంతిక గత కొంతకాలంగా ప్రేమిస్తున్నట్లుగా వార్తల వచ్చిన విషయం తెలిసిందే. వారి ప్రేమని ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించడంతో.. వారి వివాహానికి మార్గం సుగమమైంది. గురువారం గోవాలో గ్రాండ్‌గా జరిగిన ఈ పెళ్లికి సంబంధించి కొన్ని ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


అవంతిక, శ్రవణ్ శ్రీనివాసన్ పెళ్లి వేడుకకు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పలువురు దిగ్గజాలు హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి దంపతులు, అక్కినేని నాగార్జున దంపతులు, విక్టరీ వెంకటేష్ దంపతులు ఈ వేడుకలో సందడి చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా చిరు, వెంకీ డ్రస్సింగ్ అయితే అదిరిపోయిందనే చెప్పాలి. వారిద్దరూ పంచ కట్టుకుని ఈ పెళ్లిలో హడావుడి చేస్తుండటం విశేషం. చిరంజీవి (Chiranjeevi), వెంకటేష్ (Venkatesh), నాగార్జున (Nagarjuna)ల సరసన ఖుష్బూ హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వారి ఫ్యామిలీల మధ్య మంచి బాండింగ్ ఉందనే విషయం తెలియంది కాదు. మరో వైపు హీరోయిన్ త్రిష కూడా మెగాస్టార్ చిరంజీవి పక్కన కూర్చుని కనిపించారు.


ఇటీవల ఓ వేదికపై ఖుష్బూ మాట్లాడుతూ.. ‘‘నా పెద్ద కుమార్తె పెళ్ళి పనుల్లో బిజీగా ఉంది. నా భర్త సుందర్‌ ‘పురుషన్‌’ షూటింగ్‌, పెళ్ళి పనుల్లో క్షణం తీరికలేకుండా ఉన్నారు. నా చిన్న కుమార్తె చిత్ర నిర్మాణ పనులు చూసుకుంటోంది. నా పెద్ద కుమార్తె ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తోంది. మరో నాలుగు చిత్రాలకు కమిట్‌ అయింది. గతంలో ఒక హీరోయిన్‌.. ప్రేమ, పెళ్ళి వంటి అంశాలపై మాట్లాడేందుకు భయపడేది. ఇప్పుడు కాలంతో పాటు అంతా మారిపోయింది. స్వేచ్ఛగా విషయం చెప్పడానికి వెనుకాడడం లేదు’’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి:

ఇది ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి దిగ్గజాలు జన్మించిన నేల- బాలయ్య

నిన్న రిజిస్టర్ మ్యారేజ్.. నేడు సంప్రదాయం ప్రకారం ఫైమా పెళ్లి

ఈ అమ్మాయికి పిలిచి అవకాశం ఇస్తే.. 15 కండీషన్లు పెట్టింది: బన్నీ వాసు

Updated Date - Jun 25 , 2026 | 10:56 PM