Nag Ashwin: 'కల్కి 2'పై బాంబ్ పేల్చిన డైరెక్టర్
ABN , Publish Date - Sep 01 , 2025 | 04:24 PM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఇది కాస్త కంగారు పెట్టించే విషయమే! ఎంత బిజీగా ఉన్నా అనుకున్న సమయానికి, అనుకున్న సినిమాలను చేసుకుంటూ పోతున్నాడనుకుంటే అంతలోనే రెబల్ స్టార్... ఫ్యాన్స్ కు భారీ షాక్ ఇచ్చేలా ఉన్నాడు. అభిమానులంతా ఎగ్జయిటింగ్ గా ఎదురుచూస్తున్న ఆ ప్రాజెక్టు విషయంలో ప్రభాస్ తడబడుతున్నట్టే కనిపిస్తోంది.
'కల్కి 2898 AD' (Kalki 2898 AD) సూపర్ హిట్ తర్వాత ఫ్యాన్స్ ఇప్పుడు దాని సీక్వెల్ 'కల్కి 2' (Kalki 2) కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin), ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ (Ashwini Dutt ) గతంలో ఈ ఏడాది చివరి నుంచి 'కల్కి 2' షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. కానీ, రీసెంట్ పాడ్‌కాస్ట్‌లో నాగ్ అశ్విన్‌ని ‘కల్కి -2 ఎప్పుడు?’ అని అడిగితే, స్ట్రెయిట్ ఆన్సర్ ఇవ్వకపోవడంతో అనుకున్న సమయానికి స్టార్ట్ అవుతుందా.. అసలు ఇప్పట్లో రిలీజ్ అవుతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి.
'కల్కి 2' సెట్స్ పైకి వెళ్లాలంటే చాలా విషయాలు కనెక్ట్ కావాలని, యాక్టర్స్ అందరి టైం మ్యాచ్ అవ్వాల్సి ఉందని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చాడు. అలాగే ప్రీ-విజువలైజ్డ్ సీక్వెన్సెస్, యాక్షన్ సీన్స్ భారీగా ఉండటంతో వీఎఫ్ ఎక్స్ కూ టైమ్ పడుతుందని వివరించాడు. ఈ ఏడాది చివరి నుంచి షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకున్నప్పటికీ అది కూడా టైమ్ పట్టేలా ఉందన్నాడు. ఒకవేళ సినిమా షూటింగ్ ప్రారంభించిన పూర్తి చేసినా... పోస్ట్ ప్రొడక్షన్‌కి ఇంకా ఎక్కువ టైమ్ తీసుకుంటుందని, ఫైనల్ గా బిగ్ స్క్రీన్‌పైకి రావడానికి మరో రెండు లేదా మూడేళ్ళు పడుతుందని చావు కబురు చల్లాగా చెప్పాడు నాగ్ అశ్విన్. దాంతో అసలీ సీక్వెల్ ఇప్పట్లో వస్తుందా? రాదా? అనే సందేహంలో అభిమానులు పడిపోయారు.
ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం 'ది రాజా సాబ్', హను రాఘవపూడి 'ఫౌజీ' సినిమాల షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. 'రాజా సాబ్' ( Raja Saab) షూటింగ్ ఈ నెలాఖరుకు పూర్తి కావచ్చని అంటున్నారు. అయితే... హను రాఘవపూడి సినిమాకు గుమ్మడి కాయ కొట్టడానికి ఇంకా కాస్త టైమ్ పట్టొచ్చట. ఇక సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' ( Spirit) షూటింగ్ ఈ నెలా లేదా అక్టోబర్‌లో స్టార్ట్ చేస్తారట. ఈ సినిమాలో ప్రభాస్ స్పెషల్ లుక్ కోసం సందీప్ రెడ్డి వంగా ఇన్నాళ్లు వెయిట్ చేశాడని ఇండస్ట్రీలో టాక్. మరి ఈ బిజీ షెడ్యూల్‌లో 'కల్కి 2' కోసం, 'స్పిరిట్8 డిఫరెంట్ లుక్‌తో ప్రభాస్ ఎంత సమయం కేటాయిస్తాడో వేచి చూడాలి.
Read Also: Dragon: ఎన్టీఆర్‌కు జోడీ కుదిరింది..
Read Also: Murugadoss Vs Siva Karthikeyan: దర్శకుడిదో మాట... హీరోది మరో మాట...