సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కాజల్‌కు టాలీవుడ్‌లో తగ్గుతున్న అవకాశాలు.. బాలీవుడ్ వైపు అడుగులు?

ABN, Publish Date - Oct 21 , 2026 | 01:26 PM

టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోల సరసన వరుస సినిమాలతో సందడి చేసిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు తెలుగు సినిమాలను ఆచితూచి ఎంచుకుంటోంది. బాలీవుడ్, వెబ్ సిరీస్‌లపై ఫోకస్ పెంచుతున్న కాజల్ టాలీవుడ్‌కు దూరమవుతోందా?

Kajal Aggarwal

గ్లామర్ గాళ్స్ గేమ్‌లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న 'చందమామ' కాజల్ అగర్వాల్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన వరుస సినిమాలతో సందడి చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు తెలుగు సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన కాజల్.. ఇకపై బాలీవుడ్ ప్రాజెక్టులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతుందా!? టాలీవుడ్‌కు క్రమంగా దూరమవుతోందా? అనే చర్చలు ఫిల్మ్ సర్కిల్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

కాజల్ పేరు వినిపిస్తే చాలు.. అందమైన చిరునవ్వు, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, గ్లామర్‌తో కూడిన స్క్రీన్ ప్రెజెన్స్ గుర్తొస్తాయి. టాలీవుడ్‌తో తన జర్నీని మొదలుపెట్టిన ఈ బ్యూటీ.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది. కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ నుంచి ఫ్యామిలీ డ్రామాల వరకు విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైంది. తనదైన స్టైల్, స్క్రీన్ అప్పీల్‌తో యూత్‌లోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఒక దశలో టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల జాబితాలో తన పేరును బలంగా నిలబెట్టుకున్న కాజల్.. దశాబ్దానికి పైగా వెండితెరపై తనదైన ముద్ర వేసింది.


కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్న కాజల్.. ఆ తర్వాత కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యతనిస్తూ వైవాహిక జీవితాన్ని ఆస్వాదించింది. తన కుమారుడితో విలువైన సమయాన్ని గడుపుతూ కుటుంబ బాధ్యతల్లో బిజీ అయింది. అయితే, సినిమాలపై ఉన్న ప్యాషన్ మాత్రం ఈ బ్యూటీని మళ్ళీ కెమెరా ముందుకు తీసుకొచ్చింది. కొంత విరామం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈ అందాల భామ తన సెకండ్ ఇన్నింగ్స్‌తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తోంది.

అయితే సెకండ్ ఇన్నింగ్స్‌లో కాజల్‌ ఎక్కువ లేడీ ఓరియెంటెడ్ కథలతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ నటిగా కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ.. గతంలో అమ్మడికి వచ్చినంత స్థాయిలో కెరీర్‌ను మలుపు తిప్పే ప్రాజెక్టులు దక్కడం లేదనేది నిజం. దీంతో కాజల్ తన కెరీర్‌ను కొత్త దిశలో తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోందట. తెలుగుతో పాటు హిందీ సినిమాలపైనా కాజల్ ఫోకస్ పెంచుతున్నట్టుగా కనిపిస్తోంది. బాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఈ బ్యూటీకి అక్కడి ప్రయాణం ఆశించిన స్థాయిలో సాగడం లేదనే టాక్ వినిపిస్తోంది. అయినప్పటికీ, వెనక్కి తగ్గకుండా కొత్త అవకాశాల కోసం ఎదురుచూస్తోందట. ప్రస్తుతం నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక రామాయణం ప్రాజెక్టులో మండోదరి పాత్రలో కాజల్‌ కనిపించనుంది.


ఇదిలా ఉంటే, టాలీవుడ్‌లో ప్రస్తుతం హీరోయిన్ల ఎంపిక విషయంలో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. సీనియర్ హీరోల సినిమాల్లోనూ ఇతర భాషలకు చెందిన కథానాయికలకు అవకాశాలు దక్కుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్, కన్నడ చిత్ర పరిశ్రమల నుంచి వస్తున్న హీరోయిన్లు తెలుగు సినిమాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దీంతో ఇప్పటికే టాలీవుడ్‌లో మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ హీరోయిన్లకు అవకాశాల విషయంలో పోటీ పెరిగిందనే చర్చ సాగుతోంది. మారుతున్న ఈ కాంపిటీషన్‌లో తమ స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే కథల ఎంపిక నుంచి కెరీర్ ప్లానింగ్ వరకు కొత్త వ్యూహాలు అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే, కాజల్ మాత్రం ఈ మార్పులకు తగ్గట్టుగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. తెలుగు సినిమాలతో పాటు హిందీ ప్రాజెక్టులు, వెబ్ సిరీస్‌లపై కూడా దృష్టి పెడుతోంది. 'కన్నప్ప' తర్వాత చాలా గ్యాప్ తీసుకుని బాలయ్య సినిమాల్లో పవర్ ఫుల్ రోల్ లో కనిపించనుంది కాజల్‌. కానీ, కాజల్ టాలీవుడ్‌కు దూరమవుతోందనే వార్తలు మాత్రం ఆమె అభిమానులకు నిరాశను కలిగిస్తున్నాయి. మొత్తం మీద కాజల్‌కు అవకాశాలు తగ్గుతుండటంతో టాలీవుడ్‌కు పూర్తిగా గుడ్‌బై చెబుతుందేమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

మరో స్టార్ హీరోని పట్టిన బుచ్చిబాబు.. ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి

స్పిరిట్ పోయింది.. ఎల్లమ్మ వచ్చింది

దేవుళ్లనే నమ్ముకున్న ఆది.. మొన్న శంబాల.. నేడు రుద్ర

Updated Date - Oct 21 , 2026 | 01:34 PM