సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కథలో కొత్తదనం ఉంటే రిస్క్ తీసుకోవడానికి రెడీ- ‘జెట్లీ’ నిర్మాత

ABN, Publish Date - Apr 29 , 2026 | 10:13 PM

కమెడియన్ సత్య, దర్శకుడు రితేష్ రానా కాంబోలో రూపుదిద్దుకున్న చిత్రం ‘జెట్లీ’. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి(చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తోంది.

Jetlee Producer Cherry

కమెడియన్ సత్య (Satya), దర్శకుడు రితేష్ రానా (Ritesh Rana) కాంబోలో రూపుదిద్దుకున్న చిత్రం ‘జెట్లీ’ (Jetlee). క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి(చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా హీరోయిన్‌గా తెలుగు చిత్రసీమకు పరిచయం అవుతున్నారు. వెన్నెల కిషోర్, అజయ్ వంటి వారు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం మే 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు ముస్తాబైంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర నిర్మాత చెర్రీ (Chiranjeevi (Cherry)), మీడియాకు చిత్ర విశేషాలను తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

‘‘డైరెక్టర్ రితేష్ పూర్తిగా డిఫరెంట్ సబ్జెక్ట్‌ని రెడీ చేశాడు. దాదాపు 80 శాతం సినిమా ఫ్లైట్‌లోనే ఉంటుంది. అది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఒక సినిమా అంతా ఫ్లైట్‌లో జరిగినట్లు నేను వినలేదు. రితేష్ ఎప్పుడూ డిఫరెంట్ కథలతో వస్తాడు. తను కథ చెప్పినప్పుడే నాకు చాలా నచ్చేసింది. మా మధ్య మొదటి నుంచి మంచి అనుబంధం ఉంది. అతన్ని కూడా మా అబ్బాయిలా చూస్తాను. తనతో పని చేయడం చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది.


మైత్రి మూవీ మేకర్స్ ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్యానర్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి గర్వకారణంగా ఆ సంస్థ సినిమాలు చేస్తోంది. ఆ బ్యానర్‌లో నేను ప్రొడక్షన్ చూసుకోవడం గర్వంగా ఉంది. మైత్రీలో పెద్ద కాంబినేషన్స్‌తో సినిమాలు వస్తున్నాయి. నాకు చిన్న సినిమాలు, ఎక్స్‌పెరిమెంటల్ సినిమాలు చేయాలనే ఆసక్తి ఉంది. అందుకే ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిస్క్ తక్కువగా ఉండే కథలను ఎంచుకుంటూ ‘మత్తు వదలరా’, ‘హ్యాపీ బర్త్‌డే’, ‘మీటర్’, ‘జెట్లీ’ వంటి సినిమాలు చేశాం. ‘హ్యాపీ బర్త్‌డే’, ‘మీటర్’ థియేటర్లలో ఆశించినంతగా ఆడకపోయినా, కమర్షియల్‌గా మంచి రిజల్ట్ ఇచ్చాయి.

‘జెట్లీ’ సినిమాను మొదట సీరియస్ థ్రిల్లర్‌గా చేయాలనుకున్నాం. కథ డెవలప్ చేశాం. కొంతమంది హీరోలకు చెప్పినా, వారికి తగ్గట్టుగా ఈ కథ కుదరలేదు. ఇది రెగ్యులర్ హీరో సినిమా కాదు. అందుకే రితేష్ దీన్ని కామెడీ థ్రిల్లర్‌గా మార్చాడు. ఈ కథలో కొన్ని సన్నివేశాలు చాలా గమ్మత్తుగా అనిపిస్తాయి. అవి కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్స్ చేస్తేనే బాగా పండుతాయి. ఈ కథని సత్యకు చెప్పినప్పుడు ‘నేను హీరోనా?’ అని మొదట కొంచెం ఆలోచించాడు. కానీ డైరెక్టర్ వివరంగా చెప్పిన తర్వాతే ఓకే చెప్పాడు. ఈ సినిమాలో అందరికీ సమాన ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఉంటాయి. యాక్షన్ కూడా సినిమాటిక్ లిబర్టీతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది. రియా సింఘా చాలా చక్కగా పెర్ఫార్మ్ చేసింది.


ఆడియన్స్‌కు ఏ సినిమా నచ్చుతుందో ముందుగా ఎవరూ చెప్పలేరు. కానీ మనం కథ ఎంచుకునేటప్పుడు కొత్తదనం ఉండేలా చూసుకోవచ్చు. ఆ కొత్తదనం ఉంటే రిస్క్ తీసుకుని ఎక్స్‌పెరిమెంట్ చేయొచ్చు. కామెడీ సినిమా అంటే కేవలం నవ్వులు మాత్రమే కాదు.. మంచి కథ కూడా ఉండాలి. అలాంటి కథ ఈ సినిమాకు కుదిరింది. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఫైనల్ అవుట్‌పుట్ చూశాం. అన్నీ బాగా కుదిరాయి. చాలా నమ్మకంగా ఉన్నాం. ఈ సినిమా తర్వాత రితేష్‌తోనే ఒక హారర్ సినిమా ఉంటుంది. ఆ తర్వాత ‘మత్తు వదలరా 3’ కూడా ఉంటుంది. మరో ముగ్గురు దర్శకులు కథలు చెప్పారు, అవి ఫైనల్ అవ్వాల్సి ఉంది..’’ అని నిర్మాత చెర్రీ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

కయాదు లోహర్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

మంగ్లీపై అసత్య ప్రచారం.. అసభ్యకర పోస్టులు చేస్తున్నారు

Theater Movies: ఈ వారం.. థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతున్న‌ సినిమాలు

చందమామకు సెకండ్ ఇన్నింగ్స్.. సెట్ అవుతుందా

Updated Date - Apr 29 , 2026 | 10:13 PM