అనిల్ రావిపూడి మొదలెట్టేశాడు.. ఇక జాతరే
ABN, Publish Date - Nov 18 , 2026 | 07:18 PM
సంక్రాంతి పండగ అంటేనే బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ రచ్చ మామూలుగా ఉండదు. పెద్ద పండక్కి స్టార్ హీరోల సినిమాలు పోటీ పడుతుంటే థియేటర్లలో పండగ వాతావరణం నెలకొంటుంది.
సంక్రాంతి పండగ అంటేనే బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ రచ్చ మామూలుగా ఉండదు. పెద్ద పండక్కి స్టార్ హీరోల సినిమాలు పోటీ పడుతుంటే థియేటర్లలో పండగ వాతావరణం నెలకొంటుంది. అలాంటి పండగ సీజన్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న మరో భారీ క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అదే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కిస్తోన్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘జనవరి 12 విడుదల’ (January 12 Vidudala). విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) కలిసి నటిస్తోన్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వెంకీ కామెడీ టైమింగ్, కళ్యాణ్ రామ్ ఎనర్జీకు అనిల్ డైరెక్షన్ పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ భారీ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న గ్రాండ్‌గా థియేటర్లలోకి దిగబోతోంది.
ఈ ప్రాజెక్ట్‌కి ప్రధాన బలం ఇందులో ఉన్న భారీ తారాగణం. ఫ్యామిలీ ఆడియన్స్‌ను కట్టిపడేసేలా అనిల్ రావిపూడి అదిరిపోయే క్యాస్టింగ్‌ను సెట్ చేశారు. ఇందులో వెంకటేష్ సరసన నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ నటిస్తుండగా, కళ్యాణ్ రామ్ జోడీగా యంగ్ బ్యూటీ కృతి శెట్టి సందడి చేయనున్నారు. ఇద్దరు అగ్ర కథానాయికలు ప్రాజెక్ట్‌లో భాగం కావడంతో సినిమా స్థాయి మరింత పెరిగింది. ఫ్యామిలీ ఎమోషన్స్, కడుపుబ్బా నవ్వించే కామెడీ అంశాలతో ఈ సినిమాను పక్కా ఫెస్టివల్ ట్రీట్‌లా సిద్ధం చేస్తున్నారు. సంక్రాంతి రేసులో ఫ్యామిలీస్‌ను థియేటర్లకు రప్పించడంలో వెంకటేష్‌కి ఉన్న ట్రాక్ రికార్డ్ వేరు. గతంలో అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్ల వర్షం కురిపించాయో అంతా చూశారు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ కూడా జతకట్టడంతో సినిమాపై పాజిటివ్ వైబ్స్ భారీగా పెరిగాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ స్పీడ్ పెంచే పనిలో ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్ అప్‌డేట్ నేడో రేపో అధికారికంగా రాబోతోందనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.
ఈ చిత్రానికి తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే డైరెక్టర్ అనిల్ రావిపూడి స్వయంగా మాట్లాడుతూ, జీవీ ప్రకాష్ అద్భుతమైన ఆల్బమ్‌ను అందించారని, పాటలన్నీ కూడా చార్ట్‌బస్టర్‌గా నిలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఫస్ట్ సింగిల్ పక్కా పెప్పీ, డ్యాన్స్ నెంబర్‌గా ఉండబోతోందని, ఇన్ స్టంట్ హిట్‌గా నిలవడం ఖాయమని సినీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ రాగానే సోషల్ మీడియాలో మ్యూజికల్ ఫీవర్ స్టార్ట్ అవ్వడం పక్కా. ఈ క్రేజీ మల్టీస్టారర్‌ను షైన్ స్క్రీన్స్ అధినేత సాహు గారపాటి, జీ స్టూడియోస్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గకుండా, ఫ్రేమ్ టు ఫ్రేమ్ రిచ్‌గా ఉండేలా భారీ లొకేషన్లలో షూటింగ్ జరిపారు. పండగ సీజన్‌లో ఫ్యామిలీ మొత్తం కలిసి చూసి ఎంజాయ్ చేసేలా సినిమా రూపుదిద్దుకుంటోందట. ముఖ్యంగా వెంకటేష్, కళ్యాణ్ రామ్ మధ్య వచ్చే సీన్స్, కామెడీ ట్రాక్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ‘జనవరి 12 విడుదల’ చిత్రం బాక్సాఫీస్‌ని మరోసారి కళకళలాడేలా చేస్తుందనడంలో నో డౌట్స్.
ఇవి కూడా చదవండి:
సీఎం విజయ్‌కు థ్యాంక్స్ చెప్పిన ధనుష్.. విషయమిదే
‘వారణాసి’.. జక్కన్నా, ఈ వార్తలు నిజమేనా?
‘రామాయణ’కు తక్కువ ఫుట్‌ఫాల్స్.. భారీ కలెక్షన్స్.. ఎలా సాధ్యమైంది?