Jailer 2: ‘కూలీ’ లాస్.. అయినా ‘జైలర్ 2’ తెలుగు రైట్స్‌కు భారీ డిమాండ్!
ABN, Publish Date - May 04 , 2026 | 10:02 PM
సూపర్ స్టార్ రజనీకాంత్ గత చిత్రం ‘కూలీ’ తెలుగు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అయినా ఆ ఎఫెక్ట్ తన తదుపరి చిత్రం ‘జైలర్2’ పై పడలేదు.
సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) గత చిత్రం ‘కూలీ’ (Coolie) తెలుగు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఈ సినిమాలో కీలక పాత్ర పోషించినప్పటికీ, సుమారు రూ. 53 కోట్లకు అమ్ముడైన ఈ చిత్రం పూర్తిస్థాయిలో రికవరీ సాధించలేకపోయింది. అయినప్పటికీ, ఆ ప్రభావం రజనీ తర్వాత సినిమాపై ఏమాత్రం పడకపోవడం విశేషం. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘జైలర్ 2’ (Jailer 2) చిత్రంపై ఇండస్ట్రీలో భారీగా అంచనాలున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగు రైట్స్‌కు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది.
ముఖ్యంగా ఈ సినిమా బిజినెస్ విషయంలో నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. గత సినిమాల లాభనష్టాలతో సంబంధం లేకుండా, ఏ సినిమాకు ఆ సినిమానే అన్నట్లుగా తమ బిజినెస్ డీల్స్ ఉండేలా ఈ సంస్థ ప్లాన్ చేస్తుంటుంది. ‘జైలర్ 2’ చిత్రానికి ఉన్న విపరీతమైన క్రేజ్ దృష్ట్యా, రైట్స్ కోసం సంప్రదించిన నిర్మాతలకు ఏమాత్రం బేరసారాలకు తావులేకుండా స్పష్టమైన సందేశం పంపినట్లుగా సమాచారం.
తాజాగా వినిపిస్తోన్న వార్తల ప్రకారం.. ‘జైలర్ 2’ తెలుగు రైట్స్ కోసం సన్ పిక్చర్స్ ఏకంగా రూ. 62 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సినిమాపై ఉన్న హైప్ చూస్తుంటే ఈ భారీ ధర చెల్లించేందుకు కూడా కొందరు రెడీగా ఉన్నారట. మరి గతంలో రజనీ సినిమాలను పంపిణీ చేసిన ఏషియన్ ఫిలిమ్స్, దిల్ రాజు, సురేష్ ప్రొడక్షన్స్ వంటి దిగ్గజ సంస్థలు మళ్ళీ ఈ సినిమా కోసం చేతులు కలుపుతాయా? సన్ పిక్చర్స్ కోట్ చేసిన అమౌంట్‌ని చెల్లించి సినిమాను రిలీజ్ చేస్తాయా? అనేది చూడాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
త్రిష బర్త్‌డే.. విజయంతో విజయ్ ట్రీట్ ఇస్తాడా? లేక!
‘సన్ రైజర్స్’కు సపోర్ట్ చేస్తున్న ఈ భామ ఎవరో గుర్తు పట్టారా?
Varanasi: ‘వారణాసి’కి వాటర్ కొరత!.. మహేష్ సినిమాకు ప్రభుత్వం షాక్!
‘పెద్ది’తో ఫైట్‌కు మహేష్ బాబు ఓకే అంటాడా?