ఏంటి.. సుడిగాలి సుధీర్ కి పెళ్లి అయిపోయిందా..
ABN, Publish Date - Oct 16 , 2026 | 04:21 PM
బుల్లితెరపై సుడిగాలి సుధీర్‌కు ఉన్న క్రేజ్ మరియు పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కమెడియన్‌గా, యాంకర్‌గా, హీరోగా రాణిస్తూ కోట్లాది మంది అభిమానుల మనసుల్లో ఆయన ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.
బుల్లితెరపై సుడిగాలి సుధీర్(Sudigali Sudheer) కు ఉన్న క్రేజ్ మరియు పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కమెడియన్‌గా, యాంకర్‌గా, హీరోగా రాణిస్తూ కోట్లాది మంది అభిమానుల మనసుల్లో ఆయన ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అయితే ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ కావడం సర్వసాధారణం అయిపోయింది. ముఖ్యంగా సుధీర్ పెళ్లికి సంబంధించిన విషయాలు ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటాయి. తాజాగా ఆయనకు ఇదివరకే వివాహం జరిగిపోయిందంటూ నెట్టింట ఒక పాత పోస్ట్ తెగ హల్చల్ చేస్తోంది.
జబర్దస్త్ నటుడు రాకేష్ గతంలో తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఒక పాత పోస్ట్ ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్ట్‌లో సుడిగాలి సుధీర్ పెళ్లి దుస్తులలో, మెడలో పూలదండలతో ఒక వధువు పక్కన నిలబడి ఉండటం కనిపిస్తుంది. అలాగే ఆయన పక్కన జబర్దస్త్ రాకేష్, ధనరాజ్ కూడా ఉన్నారు. ఈ పిక్ చూసిన చాలామంది అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. సుధీర్‌కు పదేళ్ల కిందటే పెళ్లయిపోయిందా? అని రకరకాల చర్చలు మొదలుపెట్టారు. ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ ఫోటో చూసిన అందరూ ఏంటి.. నిజంగా సుధీర్ కి పెళ్లయిపోయిందా.. ? మరి రష్మీతో ప్రేమాయణం అంటూ వచ్చిన వార్తలు పుకార్లేనా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఫోటోలు నిజమే కానీ.. సుధీర్ కి పెళ్లి జరగలేదు. 2014 లో ఒక అమ్మాయితో సుధీర్ కి ఎంగేజ్ మెంట్ జరిగిందట. ఆ తరువాత పెళ్లి వరకు వెళ్లకుండానే వారిద్దరూ విడిపోయారట. అప్పటి ఫోటోలు ఇప్పుడు ఎవరో కావాలని పోస్ట్ చేసి సుధీర్ పై లేనిపోని పుకార్లు పుట్టిస్తున్నారని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఇక సుధీర్ కెరీర్ విషయానికొస్తే.. ఆయన నటించిన గోట్ రిలీజ్ కి సిద్ధమవుతుండగా.. హైలెస్సో సెట్స్ మీద ఉంది. మరి ఈ సినిమాలతో సుధీర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
ఇవి కూడా చదవండి:
Saturday TV Movies: అక్టోబర్ 17, శనివారం.. TV ఛానళ్లలో వచ్చే సినిమాలు
రణబాలి రివ్యూ: విజయ్ దేవరకొండ వీరగాథ ఎలా ఉంది?
జైలర్ 2 రివ్యూ.. సీక్వెల్ సెంటిమెంట్‌ను చెరిపేసిన రజనీకాంత్!