సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్ వేడుక ఎక్కడంటే..

ABN, Publish Date - Aug 08 , 2026 | 07:10 PM

మాస్ మహారాజా రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఇరుముడి’. ఈ మూవీ ట్రైలర్ విడుదలకు వేదిక ఫిక్సయింది.

Ravi Teja in Irumudi Movie

మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja), శివ నిర్వాణ (Shiva Nirvana) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఇరుముడి’ (Irumudi). మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) గ్రాండ్‌గా నిర్మిస్తోన్న ఈ చిత్రం ఆగస్టు 21న భారీ స్థాయిలో థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. ఇప్పుడీ మూవీ నుంచి థియేట్రికల్ ట్రైలర్‌ను వదిలేందుకు మేకర్స్ డేట్ ఫిక్స్ చేశారు. డేట్ మాత్రమే కాదు.. ట్రైలర్ రివీల్ వేడుక ఎక్కడో కూడా అధికారికంగా ప్రకటించారు.


ఆగస్ట్ 12న భీమవరంలో జరిగే భారీ కార్యక్రమంలో ‘ఇరుముడి’ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ మేకర్స్ ఓ పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ కార్యక్రమానికి రవితేజ స్వయంగా హాజరుకానుండటంతో, ఇది సినిమా ప్రచారంలో ఒక కీలక ఈవెంట్ కానుంది. ట్రైలర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌‌ని గమనిస్తే.. రవితేజ రెండు విభిన్న అవతారాల్లో కనిపిస్తున్నారు. ఒకవైపు నోటిలో గొడ్డలితో మాస్ లుక్‌లో కనిపిస్తుండగా, మరోవైపు అయ్యప్ప మాల ధరించిన ఆధ్యాత్మిక అవతార్‌లో ఉన్నారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌లో సినిమా కథలోని భావోద్వేగ, ఆధ్యాత్మిక అంశాలనే ఎక్కువగా ప్రజెంట్ చేశారు. ఇప్పుడు ట్రైలర్ ద్వారా రవితేజ పాత్ర ఏమిటి? ఇతర కీలక పాత్రలతో ఆయన సంబంధం ఎలా ఉంటుంది? అసలు కథను నడిపించే పరిస్థితులు ఏమిటనే విషయాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


‘ఇరుముడి’లో రవితేజ ఇప్పటివరకు చూడని విధంగా మరింత ఫ్యామిలీ ఓరియెంటెడ్ పాత్రలో కనిపించనున్నారు. ముఖ్యంగా తన కుమార్తెకు, ఆయనకు మధ్య ఉండే అనుబంధం ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌లో ఆకట్టుకుంది. దీంతో సినిమాలో కుటుంబ బంధాలు, భావోద్వేగాలకు కీలక స్థానం ఉండబోతుందనేలా తెలుస్తోంది. ప్రియ భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బేబీ నక్షత్ర ఓ కీలక పాత్రలో కనిపించనుంది. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ ఆలస్యం.. కారణం ఇదేనా!

The Paradise: చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభమేలా..

Srinivasa Mangapuram: పరాజయాన్ని అంగీకరించిన అజయ్ భూపతి

Updated Date - Aug 08 , 2026 | 07:10 PM