Irumudi: ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’కు డేట్ ఫిక్స్
ABN , Publish Date - Jun 27 , 2026 | 07:21 PM
మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. మాస్ రాజా ఈ చిత్రంతో విభిన్నమైన ఎమోషనల్ పాత్రలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే.
మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) ‘ఇరుముడి’ (Irumudi) మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. మాస్ రాజా ఈ చిత్రంతో విభిన్నమైన ఎమోషనల్ పాత్రలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన ‘ది హార్ట్ ఆఫ్ ఇరుముడి’ వీడియోతో మంచి స్పందనను రాబట్టుకుని సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. ఆ వీడియో ఎమోషన్‌ని అద్భుతంగా ఆవిష్కరించింది. ఇందులో రవితేజ అంకితభావం గల తండ్రిగా కనిపించగా.. తండ్రీకూతుళ్ల అనుబంధమే కథకు ప్రధాన బలంగా నిలవనుందని ఈ వీడియో చాటి చెప్పింది.
ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్స్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టారు. అందులో భాగంగానే జూన్ 29న ‘ఇరుముడి కట్టు’ తొలి పాటను (Irumudi First Single Irumudi Kattu) విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. అయ్యప్ప మాల ధరించిన రవితేజ, రాబోయే యాత్రా సీజన్‌కు అనుగుణంగా ఈ పాట విడుదల కానుండటంతో, ఇది ఆధ్యాత్మిక అనుభూతిని అందించడమే కాకుండా చిత్ర సంగీతానికి సరైన ఆరంభంగా నిలవనుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు.
ఈ పాట రిలీజ్ అప్డేట్ తెలుపుతూ విడుదల చేసిన పోస్టర్‌లో.. ఆలయం వైపు చేయి ఎత్తి చూపిస్తూ, భారీ సంఖ్యలో భక్తుల మధ్య రవితేజ కనిపించారు. భక్తిభావం ఉట్టిపడే సన్నివేశాలు.. ఈ పాట విజువల్‌గా, ఎమోషనల్‌గా హృదయానికి హత్తుకునేలానూ ఉండబోతోందని తెలుస్తోంది. రవితేజ సరసన ప్రియా భవాని శంకర్ నటిస్తుండగా.. కథకు కీలకంగా నిలిచే పాత్రలో బేబీ నక్షత్ర కనిపించనుంది. సాయి కుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వసిక ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 21న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
‘నాగబంధం’ బిజినెస్.. డిస్ట్రిబ్యూటర్స్ వివరాలివే!
Kamal Haasan: ఒకే నెలలో గురు శిష్యుల మరణం.. తమిళ పరిశ్రమ కన్నీరుమున్నీరు..
Naga Chaitanya: నా కెరీర్‌లో బెస్ట్ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఆ హీరోయిన్‌తోనే