రోషన్‌ మేకను సూపర్‌హీరోగా చూపించనున్న ఇంద్రగంటి!

ABN , Publish Date - Nov 11 , 2026 | 05:18 PM

రోషన్‌ మేక హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా సూపర్‌హీరో సినిమా ప్రారంభమైంది. రేఖా పాండే తెలుగు తెరకు పరిచయం అవుతుండగా, వినయ్ రాయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. డిసెంబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం కానుంది.

Roshan Meka New Movie

రోషన్‌ మేక హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అశోక్‌ వర్థన్‌ ముప్పా, సునీల్‌ బలుసు ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం బుధవారం జరిగింది. ముప్పా వెంకయ్య చౌదరి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, హీరో శ్రీకాంత్ క్లాప్ కొట్టారు. అనంతరం ముప్పా వెంకయ్య చౌదరి చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందజేశారు.


WhatsApp Image 2026-11-11 at 1.48.33 PM (2).jpeg

ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ, 'రోషన్ మేకను గతంలో ఎన్నడూ చూడని పవర్ ఫుల్ సూపర్‌హీరో అవతార్‌లో చూపించేందుకు దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి భారీ స్థాయి యాక్షన్ అడ్వెంచర్ కథను సిద్ధం చేశారు. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం ఆయన దాదాపు ఏడాదిన్నర పాటు ప్రీ-ప్రొడక్షన్ వర్క్స్ చేశారు. స్క్రిప్ట్‌ను పూర్తిస్థాయిలో డెవలప్ చేయడంతో పాటు, ప్రతి అంశాన్ని జాగ్రత్తగా తీర్చిదిద్దారు. ఆసక్తికరమైన కథాంశానికి అత్యాధునిక సాంకేతికత, భారీ స్థాయి విజువల్స్‌ను జోడించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు' అని అన్నారు.


IMG-20261111-WA0034.jpg

ఈ సినిమాతో బాలీవుడ్ నటి రేఖా పాండే తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. నటుడు వినయ్ రాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. వీరిద్దరి రాకతో ఈ ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం పనిచేస్తోంది. పి.జి. విందా సినిమాటోగ్రఫీ నిర్వహించనున్నారు. ‘హనుమాన్’, ‘మిరాయ్’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న గౌర హరి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్లు రామకృష్ణ సబ్బాని, మోనికా నిగోట్రే ఈ సినిమా కోసం భారీ విజువల్ వరల్డ్‌ను రూపొందించనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన యాక్షన్ కొరియోగ్రాఫర్ లీ విటేకర్‌తో పాటు రామకృష్ణ యాక్షన్ సన్నివేశాలను రూపొందించనున్నారు. మార్తాండ్ కె. వెంకటేష్ దీనికి ఎడిటింగ్. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో భారీగా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది.

ఇవి కూడా చదవండి:

Renudesai: తమిళనాట వార్తల్లో నిలిచిన రేణు దేశాయ్ 

విడుదలకు ఒక్కరోజు ముందు ‘అ’ వాయిదా!

Siddu 10: సిద్దు.. నయన్.. ఓ రొమాంటిక్ డ్రామా

Updated Date - Nov 11 , 2026 | 05:18 PM